Anaganaga Oka Raju: ట్రెండింగ్‌గా నవీన్ పోలిశెట్టి మూవీ టీజర్.. కామెడీ టైమింగ్ అదుర్స్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జోరుమీదున్న హీరోలలో నవీన్ పొలిశెట్టి టాప్ ట్రెండింగ్ లిస్టులో ఉన్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా తన స్థాయిని పెంచుకున్న అతను రాబోయే సినిమాలతో కూడా అంతకు మించి అనేలా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఒక ప్రత్యేకమైన నెగిటివ్ పాత్రలో కనిపించిన నవీన్ అనంతరం 1 నేనొక్కడినే వంటి సినిమాల్లో కూడా డిఫరెంట్ పాత్రలు చేశాడు. ఇక అతనికి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది గాని హీరోగా మాత్రం క్లిక్కవ్వడానికి చాలా సమయం పట్టింది. ఇక మొత్తానికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న నవీన్ పొలిశెట్టి అనంతరం అనుదీప్ దర్శకత్వంలో చేసిన జాతిరత్నాలు సినిమాతో అంతకుమించి అనేలా మరొక హిట్ అందుకున్నాడు.

ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన బిభత్సానికి మనోడికి ఆఫర్స్ కుప్పలు కుప్పలుగా వచ్చాయి. కానీ ఈ టాలెంటెట్ హీరో మాత్రం కేవలం తనకు నచ్చిన డిఫరెంట్ సినిమాలను మాత్రమే చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇక ఫైనల్ గా సీతారా ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలయికలో నవీన్ పొలిశెట్టి మరో సినిమా చేసేందుకు సిద్దమ్మయ్యాడు. ఇటీవల సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ ను కూడా విడుదల చేయగా అది సోషల్ మీడియాలో ఈజీగా వైరల్ అయ్యింది. అనగనగా ఒకరాజు అనే ఈ కామెడీ ఎంటర్టైనర్ లో నవీన్ పెళ్లికి సిద్ధమైన యువకుడిగా గొప్పలు చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది. పెళ్లికి సిద్ధంగా ఉండే రాజుగాడు తన కామెడీ టైమింగ్ తో మొదట్లోనే ఎంతగానో ఎట్రాక్ట్ చేశాడు. ఇక ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 2 మిలియన్స్ కు పైగా వ్యూవ్స్ అందుకొని యూ ట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతోంది.

మరోసారి నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ తో వైరల్ గా మారింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను నగవంశీ , త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర నిర్మాతలు నమ్ముతున్నారు.

naveen polishetty Anaganaga Oka Raju title teaser

ఇక నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు సమాచారం. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ పనులను కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే మరొక అప్డేట్ లో మిగతా విషయాలని చెబుతారట. ఇక నవీన్ యూవీ క్రియేషన్స్ లో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అనుష్క శెట్టి మేయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ఫినిష్ కానుంది. ఆ సినిమాలో నవీన్ తనకంటే పెద్ద వయసున్న అనుష్క ప్రేమలో మునిగి తేలే యువకుడిగా కనిపిస్తాడట. మరి ఆ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X