ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నా.. ఆ సమయంలో చిరంజీవి గారు లేకుంటే..

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, క్రమంగా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ అనగనగా ఒక రాజు సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం (జనవరి 30) నిర్వహించిన సక్సెస్ ఈవెంట్‌లో నవీన్ తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అందరి మనసులు తాకాయి.

సాధారణ కుటుంబంలో పుట్టిన తన ప్రయాణం గురించి నవీన్ మాట్లాడుతూ.. చిన్ననాటి కలల నుంచే సినిమాపై తనకు ఉన్న మక్కువను వివరించారు. 'నేను మూడో, నాలుగో తరగతి చదువుతున్న రోజుల్లో ఒక రోజు హీరోగా ఉన్నట్టు కల వచ్చింది. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలి, హీరో కావాలి అనే కోరిక మొదలైంది. కానీ అది అప్పట్లో నాకు ఇంపాజిబుల్ డ్రీమ్‌లానే అనిపించేది. ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవడం అసాధ్యమే అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి' అని చెప్పారు.

Naveen Polishetty Gets Emotional About Chiranjeevi s Journey at Anaganaga Oka Raju Success Meet

అలాంటి సమయంలో తనకు స్ఫూర్తిగా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి ప్రయాణమేనని నవీన్ తెలిపారు. 'చిరంజీవి గారి జర్నీ నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆడిషన్స్‌కు వెళ్లినా, ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది అనే నమ్మకాన్ని ఆయన ప్రయాణం నాలో నింపింది. చిరంజీవి గారు నాకు గురువు లాంటివారు' అంటూ ఆయనపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ సంక్రాంతి రేసులో మెగాస్టార్‌తో పాటు తన సినిమా నిలవడం తనకు గర్వకారణమని నవీన్ అన్నారు. 'ఓవైపు బాస్ తన సినిమాలతో థియేటర్లను షేక్ చేస్తూ ఉంటే, మరోవైపు నా సినిమా కూడా బాగా నడవడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా, నా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా మారింది. ఒక మెగా ఫ్యాన్‌గా ఇది నాకు దక్కిన పెద్ద గిఫ్ట్' అంటూ ఎమోషనల్ అయ్యారు.

తన కెరీర్‌లో ఎదురైన నిరుత్సాహకర అనుభవాలను కూడా నవీన్ ఈ సందర్భంగా పంచుకున్నారు. 'ముంబయిలో ఆడిషన్స్ కోసం తిరుగుతున్న సమయంలో ఒక దశలో ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నాను. హీరో కావడం ఎంత కష్టమో ఆ ప్రయాణం చేసినవారికే అర్థమవుతుంది. 'యూట్యూబర్ నుంచి హీరో అయినవారు ఎవరు ఉన్నారు?' అంటూ చాలామంది నన్ను నిరుత్సాహపరిచారు. ఆ సమయంలో ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నా' అని గుర్తుచేశారు.

అయితే అలాంటి మాటలన్నిటికీ సమాధానంగా తెలుగు ప్రేక్షకులు తనకు వరుసగా నాలుగు విజయాలు అందించారని నవీన్ అన్నారు. 'ప్రేక్షకుల ప్రేమే నాకు బలం. ఈ రోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం వాళ్లే. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా సాధారణ కుటుంబం నుంచి హీరో స్థాయికి ఎదిగిన నవీన్ పొలిశెట్టి ప్రయాణం యువతకు ఒక ప్రేరణగా నిలుస్తోంది. చిరంజీవి జర్నీ నుంచి స్ఫూర్తి పొందిన ఈ యువ నటుడు నవీన్ పొలిశెట్టి కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X