Radhe Shyam Event కోసం యాంకర్‌గా మారిన హీరో.. ప్రభాస్ సాయానికి రుణం తీర్చుకుంటున్నాడుగా!
రెబెల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. కెరీర్ ఆరంభం నుంచీ తెలుగు చిత్రాలకే పరిమితం అయిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' మూవీతో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి ఎన్నో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు.
ఇక, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం జరగబోతుంది. దీనికి ఓ యంగ్ హీరో హోస్టుగా చేయబోతున్నాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘రాధే శ్యామ్' అంటున్న ప్రభాస్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

మళ్లీ అదే సమస్య.. చాలా లేటుగా
గతంలో వేగంగా సినిమాలు చేసిన ప్రభాస్.. 'బాహుబలి' నుంచి వేగాన్ని తగ్గించాడు. మంచి ఔట్‌పుట్ కోసం సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇదే 'రాధే శ్యామ్' విషయంలోనూ జరిగింది. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయినా.. పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల టాకీ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తి కాక లేట్ అయింది.

అంచనాలకు తగ్గట్లుగానే బిజినెస్
'రాధే శ్యామ్' మూవీ ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో దీనికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

డిసెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్
ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' మూవీ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు గానూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. దీన్ని డిసెంబర్ 23న హైదబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వైభవంగా జరపబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఆరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి దీన్ని మొదలు పెడుతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

యాంకర్‌గా మారబోతున్న నవీన్
'రాధే శ్యామ్' ట్రైలర్‌ను లాంఛ్ చేసేందుకు గానూ రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ ఫంక్షన్‌లో ట్రైలర్‌ను ప్రేక్షకులే విడుదల చేయబోతున్నారు. దీంతో దీనికి కొన్ని లక్షల మంది హాజరు కాబోతున్నారు. ఇక, ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హోస్టింగ్ చేయనున్నాడు.
Recommended Video

ప్రభాస్ సాయానికి రుణం తీరేలా
నవీన్ పోలిశెట్టి నటించిన 'జాతి రత్నాలు' సినిమా కోసం ప్రభాస్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టారే విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ రుణం తీర్చుకునేందుకు నవీన్ పోలిశెట్టికి ఇలా అవకాశం దొరికినట్లైంది. ఇక, అతడు రాధే శ్యామ్ ఈవెంట్‌ను తనదైన హోస్టింగ్‌తో మరింత హైలైట్ చేస్తాడనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











