యంగ్ హీరోతో మహేశ్ బాబు సినిమా: త్వరలోనే అధికారిక ప్రకటన

కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. హీరోగా ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. పలు వ్యాపారాలనూ ప్రారంభించాడు. ఇప్పటికే ఏఎంబీ పేరిట హైదరాబాద్‌లో థియేటర్ ఓపెన్ చేసిన ఈ స్టార్ హీరో... జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను కూడా మొదలు పెట్టాడు. ఇప్పటికే ఇందులో 'మేజర్' అనే సినిమాను ప్రకటించాడు. అడవి శేష్ హీరోగా ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శ‌శికిర‌ణ్ తిక్క దర్శకుడు.

'మేజర్' పట్టాలపై ఉండగానే... 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' అనే సినిమాతో టాలీవుడ్ మొత్తానికి చర్చనీయాంశంగా మారిపోయిన నవీన్ పోలిశెట్టితో మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టేశాడట సూపర్ స్టార్ మహేశ్ బాబు. తన సొంత నిర్మాణ సంస్థ జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించే ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Naveen Polishetty Movie under Mahesh Babu Production

'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న వ్యాపారవేత్తలను ఇందులో టార్గెట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది.

Naveen Polishetty Movie under Mahesh Babu Production

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X