జాతిరత్నాలు ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ డోస్ పెంచిన నవీన్ పొలిశెట్టి.. ఆఫర్స్ ఎన్ని వచ్చాయంటే?
బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఎంత ఉన్నా కూడా ఆడియెన్స్ మనసును దోచుకోవడం అంత ఈజీ కాదు. టాలెంట్ ఉంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా అభిమానుల ప్రేమను సొంతం చేసుకోవచ్చు. నాని, విజయ్ దేవరకొండ వంటి సోలో ఫైటర్స్ ఎలా కష్టపడ్డారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక వారి తరువాత ఇప్పుడు నవీన్ పొలిశెట్టి కూడా తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ఈ కుర్ర హీరో కు ఇప్పుడు మార్కెట్ లో డిమాండ్ గట్టిగానే పెరిగింది. ఇక రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు టాక్ వస్తోంది.

ఇంగ్లండ్ లో జాబ్ వదిలేసి
నవీన్ పొలిశెట్టి పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ అంటే ఇష్టంగా పెరిగాడు. స్కూల్ కాలేజీల్లో ఎన్నో డ్రామాల్లో నటించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఇంగ్లాండ్ లో మంచి జాబ్ కొట్టిన నవీన్ అక్కడే కొన్నాళ్ళు ఉన్నాడు. కానీ నటన మీద ఆసక్తితో మళ్ళీ ఇండియాకు వచ్చాడు.

మొదటి అవకాశం
బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా ఎక్కడ ఆడిషన్స్ జరిగినా వెళ్ళాడు. ఇక మొదటిసారి అతనికి శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అందులో నెగిటివ్ పాత్రలో కనిపించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా అంతగా ఆడకపోవడంతో ఆఫర్స్ అనుకున్నంతగా రాలేవు.

నాలుగేళ్ళ వరకు ఖాళీగానే
మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు. ఇక 2014 అనంతరం నవీన్ కు ఆఫర్స్ ఏమి రాలేవు. నాలుగేళ్ళ వరకు ఖాళీగానే ఉన్నాడు. మధ్యలో చిన్న చిన్న ఆఫర్స్ వచ్చినప్పటికీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడు.

2019లో యూ టర్న్
ఫైనల్ గా 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. అలాగే బాలీవుడ్ లో చిచోరే సినిమాలో యాసిడ్ అనే పాత్రలో నటించి తన టాలెంట్ ను బాలీవుడ్ కు కూడా పరిచయం చేశాడు. క్లాస్ క్యారెక్టర్ అయినా, లోకల్ ఊర మాస్ క్యారెక్టర్ అయినా అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ వస్తున్నాడు.

మొదటి బాక్సాఫీస్ హిట్
మొత్తానికి జాతిరత్నాలు సినిమాతో నవీన్ తన స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 40కోట్ల మార్క్ ను అందుకుంది. హాఫ్ సెంచరికి చాలా దగ్గరలో ఉంది. ఇక సినిమా హిట్టవ్వడంతో కథానాయకుడి ఆఫర్స్ కూడా పెరిగాయి. కెరీర్ కు ఇది చాలా ముఖ్యమైన సమయం కాబట్టి నవీన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
Recommended Video

రెమ్యునరేషన్ ఎంతంటే
ఆఫర్స్ అయితే బాగానే వస్తున్నాయట. బడా నిర్మాతల నుంచి కూడా ఫోన్ కాల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్ లో కూడా సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఒక్కో సినిమాకు ఇప్పుడు 2కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. మరొక్క హిట్టు పడితే ఆ సంఖ్య ఈజీగా పెరుగుతుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











