Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాలకృష్ణకు అసిస్టెంట్‌గా యంగ్ హీరో.. రెండు భాషల్లో హిట్ కొట్టినా ఇలా చేస్తున్నాడే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభంలోనే సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిన ఆయన.. అద్భుతమైన యాక్టింగ్‌కు తోడు తనదైన శైలి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య.. గత ఏడాది ఓ భారీ విజయాన్ని అందుకున్న యంగ్ హీరోను అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు. దీంతో ఆయన అందరి దృష్టిలో పడ్డారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు.? పూర్తి వివరాల్లోకి వెళితే....
బాలయ్యకు ఎప్పుడూ ఇలా జరగలేదు
సుదీర్ఘమైన సినీ కెరీర్లో నందమూరి బాలకృష్ణ ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. అయితే, గత ఏడాదిలా ఆయనకెప్పుడూ మూడు వరుస ఫ్లాపులు ఎదురు కాలేదు. 2019లో ఆయన నటించిన ‘యన్.టి.ఆర్' రెండు భాగాలతో పాటు ‘రూలర్' విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో ఆయన అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.
హ్యాట్రిక్ కొట్టేందుకు ఆయనతో కలిశాడు
వరుస పరాజయాలతో బాధ పడుతున్న నటసింహా బాలకృష్ణ.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి రెండు భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీనుతో కలిశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కవడంతో పాటు హ్యాట్రిక్ కొట్టాలని ఈ జంట భావిస్తోంది.
ఇద్దరికీ హిట్ కావాలి.. అందుకే పక్కాగా
ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. అయితే, రామ్ చరణ్‌తో తీసిన ‘వినయ విధేయ రామ' తర్వాత అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే హిట్ కోసం అన్వేషిస్తున్న బాలయ్యతో మూవీకి సై అన్నాడు. ఇద్దరికీ హిట్ కావాలి కనుక ఈ మూవీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వాళ్ల దెబ్బతో కొత్త అమ్మాయితో ప్రయోగం
ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒక పాత్ర అఘోరాది కాగా, రెండో పాత్రకు హీరోయిన్ ఉంటుందట. దాని కోసం ఎంతో మందితో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ మూవీ కోసం కొత్త అమ్మాయిని ఎంపిక చేశారని తెలిసింది. ఇదే విషయాన్ని బోయపాటి కూడా వెల్లడించారు.
బాలకృష్ణకు అసిస్టెంట్‌గా మారిన యంగ్ హీరో
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో బాలయ్య ఓ పాత్రలో బిజినెస్‌మ్యాన్‌లా కనిపించబోతున్నాడట. దీనికి అసిస్టెంట్‌గా యంగ్ హీరో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టిని తీసుకున్నారని తెలిసింది. చాలా ప్రాముఖ్యం ఉన్న ఈ పాత్ర సినిమా మొత్తం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
Recommended Video
రెండు భాషల్లో హిట్ కొట్టినా ఇలా చేస్తున్నాడే.!
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత ‘డీ ఫర్ దోపిడీ', ‘1 నేనొక్కడినే' చిత్రాల్లో మంచి పాత్రలు చేశాడు. ఈ క్రమంలోనే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత హిందీలో ‘చిచ్చోరే'లో నటించాడు. ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. రెండు భాషల్లో హిట్ కొట్టినప్పటికీ సపోర్టింగ్ రోల్ చేస్తుండడంతో నవీన్ హాట్ టాపిక్ అవుతున్నాడు.