Kamal Hasan: కమల్ హాసన్ నెక్స్ట్ సినిమాకు హీరోయిన్ దొరికేసిందోచ్..!
లోకనాయకుడు కమల్ హాసన్ గురించి భారతీయ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తుంటారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు అందుకు సంబంధించిన అన్ని అప్ డేట్ల గురించి తెలుసుకుంటారు. గూగుల్ లో సర్చ్ చేస్తూ మరీ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చూస్తుంటారు. అయితే కమల్ హాసన్ ఇప్పటికే భారతీయుడు -2 చిత్రంలో నటించారు. తాజాగా ఆయన మరో సినిమాలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
కమల్ హాసన్ 234 సినిమాకు కేహెచ్234 అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు. అయితే దీనికి మణిరత్నం దర్శకత్వం వహించబోతున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రకటించి చాలా రోజులు కాగా... ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో కేహెచ్234 సినిమాకు హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ ను తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్ పేరు తెరమీదకు వచ్చింది. కానీ అదంతా ఉత్తి ముచ్చటే అని ఇప్పుడు తేటతెల్లం అయింది. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన నటించేందుకు నయనతారను సంప్రదించగా... ఆమె ఓకె చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అటు నయనతార కానీ ఇటు చిత్రబృందం కానీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ కచ్చితంగా నయనతార ఈ చిత్రంలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది.
కమల్ హాసన్, నయనతార జంటగా రాబోతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, త్రిషలు కూడా కనిపించనున్నారట. వారు కనిపించేది కాసేపే అయినా వీరి వల్ల సినిమాకు బాగా ప్లస్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. అలాగే కేహెచ్ 234 సినిమా టీజర్ ను నవంబర్ 7వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే టీజర్ కోసం కొన్ని సన్నివేషాలు చిత్రీకరించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి ఏం జరనగనుందో.

ఇటీవలే విక్రమ్ సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్టు అందుకున్న కమల్ హాసన్.. ఇండియన్ -2 చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచి కమల్ హాసన్ గ్రాఫ్ ను మరింత పెంచుతుందో లేదో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











