NBK107: బాలయ్య కొత్త సెంటిమెంట్.. అందుకే సినిమా టైటిల్ రివీల్ చేయలేదట

దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ బడా హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉత్సాహంతో కనిపించే ఆయన.. అసలేమాత్రం గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే, 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత చాలా కాలం పాటు వరుస పరాజయాలతో తెగ ఇబ్బంది పడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' అనే సినిమాతో బాలయ్య గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసి రికార్డులు క్రియేట్ చేసుకుంది.

'అఖండ' వంటి బిగ్ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను మొదలు పెట్టారు. ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో పాటు బాలయ్య భజానికి సర్జరీ జరగడంతో ఈ సినిమా ఫిబ్రవరిలోనే పట్టాలెక్కింది. అప్పటి నుంచి వరుసగా ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూళ్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఫేమస్ స్టూడియోలో కీలక నటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

NBK107: Balakrishna Follows New Sentiment for Gopichand Movie Title

గోపీచంద్ మలినేని - నందమూరి బాలకృష్ణ కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఇందులోని బాలయ్య ఫస్ట్ లుక్‌ను వదిలారు. ఈ పిక్‌లో ఆయన తెల్ల పంచె, నలుపు రంగు షర్ట్‌తో పవర్‌ఫుల్ గెటప్‌తో కనిపించారు. ఫలితంగా ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం అయిపోయింది. ఇక, బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 9న సాయంత్రం 6:11 గంటలకు ఈ సినిమా నుంచి NBK107 First Hunt పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ వీడియోకు భారీ స్పందన దక్కింది. దీంతో భారీగా వ్యూస్, లైకులు వచ్చాయి.

వాస్తవానికి ఈ టీజర్ విడుదల సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఇందుకోసం 'జై బాలయ్య', 'వీర సింహా రెడ్డి' అనే టైటిళ్లు కూడా వినిపించాయి. కానీ, చిత్ర యూనిట్ మాత్రం అలా చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తన సినిమా టైటిల్‌ను చివరి వరకూ రివీల్ చేయకుండా ఉండాలని బాలయ్య కొత్త సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారట. 'అఖండ' విషయంలో ఇలానే జరిగింది. దీంతో ఈ సినిమా హిట్ అయింది. కాబట్టి ఫ్యూచర్‌లో ప్రతి సినిమానూ విడుదలకు కొద్ది రోజుల ముందే అనౌన్స్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X