NBK111: ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్... సూపర్ హీరోగా బాలయ్య.. ఇక బాక్సులు బద్దలే!

నందమూరి నటసింహం బాలయ్య సినిమా అంటే.. ఫ్యాన్సుకు పునకాలు కన్మార్మ్. బాలయ్య సినిమా అప్డేట్ వచ్చినా... పండగ చేసుకుంటారు. అంతలా బాలయ్యను ఫ్యాన్స్ ఆదరిస్తారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ న్యూస్ వింటే బాలయ్య ఫ్యాన్సుకు పునకాలే. అయితే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య సూపర్ హీరో చిత్రం చేయనున్నారట. ఈ న్యూస్ స్వయంగా ప్రశాంత్ వర్మే చెప్పుకువచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

బాలయ్యకు కరోనా తర్వాత బాగా కలిసి వచ్చింది. కరోనా టైంలోనే అఖండ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలు రాబట్టాడు నటసింహం. ఆ తర్వాత ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అంటూ షో చేశాడు. ఇక ఈ షోతో ఆయనపై ఉన్న నెగిటివిటీ మొత్తం పోయిందనే చెప్పాలి. బాలయ్య అంటే కోపాస్తుడు.. ఆవేశ పరుడు అనుకునే వారు. ఈ షోతో బాలయ్య భోళా శంకరుడు అని తెలుసుకున్నారు.

NBK111 Update: Balakrishna To Be A Part of Prashanth Varmas Cinematic Universe Full Details Here

ఇక ఈ షోకు డైరెక్షన్ చేసింది.. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇక ఆయన దర్శకత్వంలో ఈ షో సూపర్ హిట్టుగా నిలిచింది. సీజన్ 1, సీజన్ 2 అన్ స్టాపబుల్ సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇక ఆ తర్వాత నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు కూడా సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇక ఈ చిత్రాలతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడు. ఇక ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇక బాబీ సినిమా పూర్తి అయిన తర్వాత బోయపాటితో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అది అఖండ 2 అని వార్తలు వస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో తన 109 సినిమా చేస్తుండగా.. బోయపాటి దర్శకత్వంలో 110సినిమా చేస్తాడు. ఇక తన ఎన్బీకే 110 సినిమా డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది. ఆయన ఎవరో కాదు.. హనుమాన్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ.. బాలయ్యతో కూడా సినిమా చేయనున్నాడట.

ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ఇటీవల ఇంటర్య్వూల్లో బయటపెట్టారు. ప్రశాంత్ వర్మ, బాలయ్యకి ఇప్పటికే రెండు కథలని వినిపించగా... ఆ రెండిటిలో ఒకటి సూపర్ హీరో మూవీ అని చెప్పుకువచ్చారు. మరొకటి ఒక మాస్ మూవీ అట. ఇక రెండిటిలో బాలయ్య ఏది ఫైనల్ చేస్తే.. దానిని అభిమానుల ముందుకు తీసుకు వస్తానంటూ ప్రశాంత్ వర్మ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చాడు. మరి బాలయ్య దేనిని ఫైనల్ చేస్తాడో చూడాలి.

NBK111 Update: Balakrishna To Be A Part of Prashanth Varmas Cinematic Universe Full Details Here

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా బాలయ్య సూపర్ హీరో సినిమా చేస్తే.. ఫ్యాన్స్ కు పునాకలే అంటున్నారు. మరి ఆ సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. ప్రశాంత్ వర్మ లైనప్ లో ప్రస్తుతం అధీర, జై హనుమాన్, మహాకాళి ప్రాజెక్ట్స్ ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. జై హనుమాన్ తరువాత ప్రశాంత్ వర్మ, బాలయ్య సినిమా చేయొచ్చని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X