Aditi Rao Hydari తో సిద్దార్థ్ రెండోపెళ్లి? భార్యభర్తలుగా మాదిరిగా ఫోటో.. నెటిజన్ కామెంట్స్ వైరల్!
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ మధ్య డేటింగ్ వ్యవహారం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మ్యారేజ్ బ్రేకప్‌తో సింగిల్‌గా ఉంటున్న ఈ హాట్ హీరో, హీరోయిన్లు ఇప్పుడు చిలకా గోరింకల్లా తిరుగుతూ మీడియా కంటపడటంపై రకరకాల ఊహగానాలు మీడియాలో వస్తున్నాయి. అయితే తమపై వస్తున్న రూమర్లు, గాసిప్స్ పట్టించుకోకుండా అఫైర్‌లో పీకల్లోతు మునిగిపోయారనే విషయం మీడియాలో వినిపిస్తున్నది. అయితే వీరిద్దరి ప్రేమ, పెళ్లి గురించి జరుగుతున్న చర్చకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మహాసముద్రం షూటింగులో అఫైర్
అదితిరావు హైదరీ, సిద్దార్థ్ మధ్య అఫైర్ మహాసముద్రం షూటింగ్ సమయంలో మొదలైంది. ఈ సినిమా సమయంలోనే వారిద్దరూ మానసికంగా దగ్గరయ్యారు. అప్పటి నుంచి చెన్నై, ముంబైలో వారిద్దరి ప్రేమాయణం కొనసాగుతున్నది. అయితే తమ అఫైర్ గురించి మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా పెద్దగా స్పందంచడం లేదు.

అదితి, సిద్దార్థ్ షికారు..
ఇక అదితిరావు హైదరీ, సిద్దార్థ్ ముంబై వీధుల్లో ప్రేమపక్షుల్లా మారిపోయారు. హోటల్స్, రెస్టారెంట్స్, కెఫేలు అనే తేడా లేకుండా రంజుగా షికారు కొడుతున్నారు. అడపదడపా చేతిలో చేయి వేసుకొని మీడియా కెమెరాలుకు చిక్కుతున్నారు. అదితిరావు హైదరీ పెద్దగా మీడియాను పట్టించుకోకపోగా.. సిద్దార్థ్ మాత్రం ముఖం చాటేసేందుకు ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది.

భార్యభర్తల మాదిరిగా ఫోజిచ్చి
అదితిరావు హైదరీతో క్లోజ్‌గా ఉంటున్న సిద్దార్థ్.. కొద్ది రోజుల క్రితం ఆమెతో సన్నిహితంగా.. ముఖ్యంగా భార్యభర్తల మాదిరిగా ఫోజిచ్చి దిగిన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆమెకు ప్రేమగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. నీవు కోరుకొన్నట్టు చిన్న, పెద్ద లేకుండా నీ కలలన్నీ నెరవేరాలి. నీ ప్రయాణంలో నేను ఎప్పడూ తోడుంటాను అంటూ సిద్దార్థ్ పోస్టు పెట్టాడు.
నీకు తోడుగా ఉంటా అంటూ అదితి
గతంలో సిద్దార్థ్ బర్త్ డే రోజున కూడా సిద్దార్థ్‌పై ప్రేమను గుమ్మరించింది. ఎప్పటి మాదిరిగానే నీ కలలు, కోరికలతో జీవితాన్ని కొనసాగించు. ఎప్పుడు నీతోడుగా నేను ఉంటాను. నీవు పంచిన నవ్వులు, ఇతర విషయాలకు థ్యాంక్స్. నీవంటే ఎంత ప్రేమనో నీకు తెలుసుకదా అని అదితిరావు హైదరీ పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై నెటిజన్లు భారీగా కామెంట్లు చేశారు.

మీ పెళ్లి ఎప్పుడు? అంటూ
సిద్దార్థ్ పోస్టు చేసిన అదితిరావు ఫోటోపై నెటిజన్లు ఫిదా అయ్యారు. మీ ఇద్దరి జంట బాగుంది. మీరు చూడటానికి ముద్దుగా ఉన్నారు. మీ బంధం ఇలానే కొనసాగాలి అంటూ కామెంట్లు పెట్టారు. ఇక నెటిజన్ తన ఉత్సాహాన్ని ఆపుకోలేక.. మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకొంటున్నారు అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ప్రస్తుతం మీడియాలో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











