సినిమా బాగా లేకపోయినా ఫస్ట్ టికెట్ తెగెదీ చిరంజీవి ఫ్యాన్స్‌దే.. మాట మార్చిన అల్లు అర్జున్‌పై మెగా ట్రోలింగ్!
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా రూపొందిన సినిమా మారుతి నగర్ సుబ్రమణ్యం. యువ దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ పతాకాలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సమర్పణలో ఆగస్టు 23న థియేటర్లలో విడుదల కానున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల దారుణంగా ట్రోల్ అవుతున్నాయి. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
గతంలో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా అభిమానుల గురించి, చిరంజీవి ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. వాళ్లే నా బలం అంటూ కామెంట్ చేశారు. ఆ సందర్బంగా..మెగా అభిమానులకు.. నేను వచ్చి 10 ఏళ్లు అయింది. నాకు ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తుంది. నేను ఎక్కడ ఉన్నానో కూడా గుర్తుంది. సో నన్ను ఈ జర్నీలో మెట్టు మెట్టు ఎక్కించినందుకు ధన్యవాదాలు అని అన్నాడు.

ఇక సినిమా బాగుంటే జనరల్ ఆడియెన్స్ వచ్చి సినిమా చూడొచ్చు. కానీ ఓ సినిమా బాగాలేకపోయినా వచ్చేది మెగా అభిమానే. ఫస్ట్ టికెట్ తెగేది ఒక చిరంజీవి ఫ్యాన్‌దే. సినిమా ఎలా ఉన్నా గానీ.. మేము స్టార్స్ అని మాతో నిర్మాతలు సినిమాలు చేస్తారు. అది మా గొప్పతనం కాదు. అది మా వెనుకాల ఉన్న మీ బలమే అని అల్లు అర్జున్ అన్నాడు.
అయితే తాజాగా మారుతి నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట మార్చేశాడు. నేను ఎప్పుడూ అంటుంటాను. ఒక హీరోను చూసి ఫ్యాన్స్ అవుతుంటారు. కానీ ఫ్యాన్స్‌ను చూసే నేను హీరో అయ్యాను. అందుకే నా ఫ్యాన్స్ అంటే పిచ్చి. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ అంటూ అల్లు అర్జున్ ఊగిపోయారు.
అయితే గత కొద్దికాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఐకాన్ స్టార్ మాత్రం వైసీపీ ఎమ్మెల్యేకు సపోర్ట్ చేయడం వివాదంగా మారడమే కాకుండా రెండు కుటుంబాల మధ్యనే కాకుండా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేలా చేసింది.
తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్రెండ్ అనుకో, ఇంకొకరు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకోండి.. ఇష్టమైన వాళ్ళ కోసం మనం నిలబడాలి. నాకు ఇష్టమైతే వస్తా. నా మనసుకు నచ్చితే వస్తా. అది అందరికీ తెలిసిందే అంటూ మెగా, అల్లు కుటుంబాల మధ్య కొత్త వివాదానికి తెర లేపారా? అనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











