రాజమౌళి వెన్నుపోటు.. రిలీజ్ డేట్ దెబ్బకి ఆడుకుంటున్న నెటిజన్లు!
అదేమిటి రాజమౌళి వెన్నుపోటు పొడవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? అది వెన్నుపోటు అని కొంతమంది ఫీలవుతున్నారు మరి. అయితే రాజమౌళి వెన్నుపోటు పొడిచాడు అని ప్రచారం జరుగుతున్నది ఎవరికో కాదు, తమిళ హీరో శివ కార్తికేయన్ కు. ఆయనకు రాజమౌళి వెన్నుపోటు పొడవడం ఏమిటి? అసలు ఎందుకు ఈ చర్చ మొదలైంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనేక వాయిదాలు
అనేక వాయిదాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా మార్చి 25వ తేదీన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గా అధికారిక ప్రకటన వెలువడింది. రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించిన ఈ సినిమాలో అలియా భట్ ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించారు. చరిత్రలో కలవని అల్లూరి సీతారామరాజు కొమురం భీం ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది ? వారిద్దరూ కలిసి స్వాతంత్ర సమరయోధులు గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని ఒక కల్పిత కథ తో రాజమౌళి మన ముందుకు వస్తున్నారు.

పది భాషల్లో
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దాదాపు పది భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా 2018 సంవత్సరంలో మొదలైంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల పడుతూ చివరిగా మార్చి 25వ తేదీన విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన చేయడానికి కొద్ది గంటల ముందు తమిళ్ లో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ‘డాక్టర్' లాంటి సీరియస్ కాన్సెప్ట్‌తో వచ్చి ఆకట్టుకున్న శివకార్తికేయన్ మరోసారి కామెడీతో కడుపుబ్బా నవ్వించడానికి స్కెచ్ వేశారు.

'డాన్'
అందుకే శిబి చక్రవర్తి డైరెక్షన్‌లో ‘డాన్' అనే కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేశాడు. డాక్టర్ తరువాత మరోసారి శివకార్తికేయన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా పూర్తై కూడా చాలా కాలమైంది. అయితే విడుదలకు మాత్రం అన్ని సినిమాల్లాగే ఈ సినిమాకు కూడా కరోనా అడ్డుపడింది. సినిమా పూర్తై చాలా కాలమైనా రిలీజ్ కావడానికి కుదరలేదు.

మార్చి 25న RRR
ఈ సినిమా ఇక ఓటీటీలోనే రిలీజని అందరూ భావిస్తూ వచ్చారు. ఈ సినిమాకి నిర్మాత కూడా అయిన శివకార్తికేయన్ రిలీజ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. థియేటర్‌లోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఇప్పటిదాకా ఉండి మార్చ్ 25న ‘డాన్'గా వచ్చి థియేటర్స్‌లో సందడి చేయబోతున్నానని సోమవారం పదిగంటల సమయంలో కన్‌ఫర్మ్ చేశాడు శివ. ఇప్పటికే తెలుగులో ఆయనకు మార్కెట్ ఏర్పడడంతో ఈ సినిమా తెలుగులోనూ రిలీజవుతోంది. అదలా ఉంచితే ఆ సినిమా ప్రకటించిన రోజు సాయంత్రమే RRRని మార్చి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

శివకార్తికేయన్ ముఖ్య అతిధిగా
నిజానికి జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి RRR షెడ్యూల్ చేసినప్పుడు ఈ సినిమా యూనిట్ బెంగళూరు, చెన్నై, కొచ్చి, ముంబై లాంటి నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించారు. అందులో చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శివకార్తికేయన్ ను ముఖ్య అతిధిగా పిలిచారు. ఆయన వచ్చి సినిమాను తమిళ్ లో ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో ఆయన సినిమాకే ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. మీ సినిమాను ప్రమోట్ చేసిన హీరో సినిమాకు దెబ్బ పడేలా చేయడం కరెక్ట్ కాదంటూ రాజమౌళిని టార్గెట్ చేసి నెటిజన్లుటార్గెట్ కామెంట్ చేస్తున్నారు.
Recommended Video

వస్తారా? లేదా
నిజానికి RRR సినిమా అనగానే స్టార్ హీరోలందరూ ఆమధ్య తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు డాన్ అనుకున్న డేట్ కే రిలీజ్ డేట్‌ని లాక్ చేశాడు. ఇక అదే రోజు రవితేజ నటిస్తున్న ‘రామారావ్ ఆన్ డ్యూటీ' మూవీ రాబోతోంది. ఆ విషయాన్ని ప్రకటించి కూడా చాలా రోజులైంది. ఈ క్రమంలో ఆ సినిమా వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇలాంటి సమయంలో డాన్ గారు ధైర్యం చేసి వస్తారా? లేదా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











