Mahesh Babu మిమ్మల్ని పాన్ మసాలా భరిస్తుందా? మహేష్ బాబుపై దారుణంగా ట్రోల్స్

సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఉత్తరాది మీడియా, ప్రేక్షకులు, సినీ వర్గాలు ముప్పేట దాడిని మొదలుపెట్టాయి. మేజర్ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా బాలీవుడ్ ఎంట్రీపై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అయితే వివాదం నేపథ్యంలో మహేష్ బాబు పొగాకు ఉత్పత్తుల కోసం వ్యాపార ప్రకటనల్లో నటించడంపై నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఏమిటి? మహేష్ బాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే విషయంలోకి వెళితే..

బాలీవుడ్‌కు భరించే శక్తి లేదు

బాలీవుడ్‌కు భరించే శక్తి లేదు

మేజర్ ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా మహేష్ బాబు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినిమాకే పరిమితం అవుతాను. బాలీవుడ్‌లో నటించను. హిందీ చిత్ర పరిశ్రమకు నన్ను భరించేంత శక్తి లేదు. నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. అందుకే నేను బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నాను అని మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం లేపాయి.

బాలీవుడ్ అంటే అంత చులకనా?

బాలీవుడ్ అంటే అంత చులకనా?

దాంతో మహేష్ బాబుపై జాతీయ మీడియా భగ్గుమంటూ రకరకాల కథనాలను ప్రసారం చేశాయి. బాలీవుడ్ అంటే మహేష్ బాబుకు అంత చులకననా? హిందీ పరిశ్రమ, భాషా చిత్రాలు అంటే గౌరవం లేదా అనే విధంగా భారీ కామెంట్లతో మహేష్‌ను టార్గెట్ చేశాయి. అయితే తనపై వస్తున్న కథనాలపై స్పందిస్తూ తనకు అన్ని భాషలన్నీ ఇష్టమే. అన్ని రంగాల సినిమా పరిశ్రమలంటే గౌరవం అని మహేష్ క్లారిటీ ఇచ్చారు.

ట్విట్టర్‌లో దారుణంగా ట్రోలింగ్

ట్విట్టర్‌లో దారుణంగా ట్రోలింగ్

బాలీవుడ్ ఎంట్రీ వివాదం ముగిసిపోతుందని అనుకొనేలోపే ఉత్తరాది మీడియా, నెటిజన్లు కొత్త వివాదాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మార్చారు. నిన్ను బాలీవుడ్ భరించలేదు పర్వాలేదు. కానీ పాన్ మసాలా భరిస్తాయి అంటూ ఆయన నటించిన పాన్ మసాల యాడ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ట్రోల్స్ చేశారు. మహేష్ బాబును ఉద్దేశించి ట్వీట్లు చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

మహేష్ ద్వంద ప్రమాణాలపై ట్రోల్స్

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాకు తెలిసి మహేష్ బాబు ఒక్కడే పాన్ మసాల ప్రోడక్ట్స్‌లో నటిస్తారమో. మిగితా నటీనటులు ఇలాంటి పొగాకు ఉత్పత్తుల్లో నటించడానికి దూరంగా ఉంటారు. మహేష్ బాబు ద్వంద ప్రమాణాలు చాలా బాగున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

పాన్ మసాలా భరిస్తుందా?

మహేష్ బాబుపై మరో నెటిజన్ ఘాటుగా స్పందిస్తూ.. టైగర్ ష్రాఫ్, మహేష్ బాబు నటించిన పాన్ మసాల యాడ్‌ను పోస్టు చేశాడు. మహేష్ బాబు.. మిమ్మల్ని బాలీవుడ్ భరించలేదు కానీ.. పాన్ మసాలా బ్రాండ్స్ మాత్రం భరిస్తాయి అంటూ నెటిజన్ల సెటైర్ వేశాడు.

పాన్ మసాలా యాడ్‌లో నటించేందుకు

బాలీవుడ్‌లో మహేష్ బాబుకు నటించడానికి అభ్యంతరాలు ఉంటాయి. కానీ టైటర్ ష్రాఫ్ లాంటి నటులతో కలిసి పాన్ మసాలా యాడ్స్‌లో నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అందులో ఆయనకు ఏమీ తప్పు కనిపించదు. ఇంకోసారి మంచి కారణం చెప్పు మహేష్ అంటూ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

సర్కారు వారీ పాట కలెక్షన్లు

సర్కారు వారీ పాట కలెక్షన్లు

ఇదిలా ఉండగా, క్రిటిక్స్, సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను అధిగమించి మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట చిత్రం భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. నైజాంలో ఈ చిత్రం 29.61 కోట్ల షేర్, సీడెడ్‌లో 9.81 కోట్ల షేర్, ఉత్తరాంధ్రలో 9.36 కోట్ల షేర్, గుంటూరులో 7.57 కోట్ల షేర్, ఈస్ట్ గోదావరి జిల్లాలో 6.51 కోట్ల షేర్, కృష్ణా జిల్లాలో 5.4 కోట్ల షేర్, నెల్లూరు జిల్లాలో 2.91 కోట్ల షేర్ సాధించింది. ఏపీ, నైజాంలో 75.58 కోట్ల షేర్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 7.6 కోట్లు, ఓవర్సీస్‌లో 11.9 కోట్ల షేర్‌తో ప్రపంచవ్యాప్తంగా 95.08 కోట్ల షేర్‌ను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X