అనంత్ అంబానీ పెళ్లిలో రాంచరణ్.. అల్లు అర్జున్ నీవెక్కడ? మెగా అభిమానుల ట్రోలింగ్!

మెగా ఫ్యామిలీలో పైకి కనిపించినట్లుగా అందరూ ఒక్కటి కాదనే విషయం అల్లు అర్జున్ ఎపిసోడ్‌తో బయటపడింది. మెగా హీరోలు, మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. ఇదంతా అల్లు అర్జున్ పుణ్యమేనని హార్డ్ కోర్ మెగా అభిమానుల మాట. అప్పుడెప్పుడో బన్నీ చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన ఓ మూవీ ఈవెంట్‌లో కోపం నషాళానికెక్కి పవన్ గురించి చెప్పను బ్రదర్ అనే మాట అనేశారు. ఆ క్షణం నుంచి అల్లు అర్జున్‌ని మెగా ఫ్యాన్స్‌ .. మెగా ఫ్యామిలీలోని వ్యక్తిగా చూడటం మానేశారు.

ఇక ఇటీవల ఏపీ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ బద్ధ వ్యతిరేకి జగన్‌ పార్టీకి చెందిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేయడాన్ని మెగా, పవన్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలో "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ నాగబాబు ట్వీట్ చేసి ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు.

netizens trolls allu arjun over he not get invitation for anant ambani radhika merchant marriage

ఆ తర్వాత అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులను తన సోషల్ మీడియా ఖాతాలలో సాయిథరమ్ తేజ్ అన్ ఫాలో చేయడం పెద్ద దుమారం రేపింది. పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు అరవింద్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. మెగా ఫ్యామిలీలోని చిన్నా, పెద్ద బెజవాడలో ఒక రోజు ముందే ల్యాండ్ అయ్యారు. వారిలోనూ అల్లు ఫ్యామిలీ జాడ లేదు.

ఇదే సమయంలో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పుష్ప -2 విడుదలను మేకర్స్ వాయిదా వేశారు. ముందు ప్రకటించినట్లుగా ఆగస్ట్ 15కి బదులు డిసెంబర్‌లో సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. మెగా, పవన్ ఫ్యాన్స్‌కు భయపడే దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. ఈ సంఘటనల తర్వాత అల్లు అర్జున్ సందడి తగ్గింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు, మెగా, పవన్ ఫ్యాన్స్ బన్నీని ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌ల వివాహాన్ని అడ్డుపెట్టుకుని నెటిజన్లు బన్నీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

netizens trolls allu arjun over he not get invitation for anant ambani radhika merchant marriage

అనంత్ అంబానీ వివాహానికి హాజరవ్వాల్సిందిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు ముఖేష్ అంబానీ నుంచి ఇన్విటేషన్ అందింది. దీంతో చెర్రీ తాను కొత్తగా కొన్న రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో రాయల్‌గా ఈ వేడుకలో అట్టహాసంగా అడుగుపెట్టారు. భార్య ఉపాసన కొణిదెలతో కలిసి అనంత్ అంబానీ వివాహా వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ హీరోలు, ఇండియన్ సెలబ్రిటీల మధ్య రాంచరణ్, ఉపాసన గ్రాండ్‌గా కనిపించారు. దాంతో రాంచరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు అంబానీ నుంచి ఇన్విటేషన్ అందలేదా, కన్వెన్షన్ సెంటర్‌కి బన్నీ వెళితే గేటు వద్ద వాచ్‌మెన్‌ ఆయనను ఇన్విటేషన్ చూపించమన్నారు అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్‌గా రాంచరణ్ స్టామినాకు, క్రేజ్‌కు అంబానీ ఇచ్చిన రెస్పెక్ట్ ఇది.. మరి నీకెందుకు అహ్వానం అందలేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. బన్నీ గతంలో మాట్లాడిన మాటలతో వీడియోలు సృష్టించి, ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు. మరి అల్లు ఆర్మీ దీనికి ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: ram charan allu arjun mega family
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X