Ranveer Singh nude Photoshoot ఒంటిపై నూలుపోగు లేకుండా బాలీవుడ్ హీరో.. చీల్చి చెండాతున్న నెటిజన్లు

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ భారీ సాహసానికి ఒడిగట్టారు. హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా రాణిస్తున్న రణ్‌వీర్.. ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోషూట్ చేసి సంచలనం రేపారు. ఇటీవల కాలంలో రణ్‌వీర్ తప్ప ఇలాంటి రిస్క్ తీసుకొన్న మరో హీరో కనిపించరు. అయితే ఇలాంటి చర్యకు పాల్పడిన ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లతో చీల్చి చెండాడుతున్నారు. రణ్‌వీర్ న్యూడ్ ఫోటోషూట్ ఎందుకు చేశాడు? ఎవరి కోసం చేశాడు? అనే వివరాల్లోకి వెళితే..

నగ్నంగా ఫోటోషూట్ చేసిన రణ్‌వీర్

నగ్నంగా ఫోటోషూట్ చేసిన రణ్‌వీర్


అంతర్జాతీయంగా గొప్ప పేరు ఉన్న మ్యాగజైన్ కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం హీరో రణ్‌వీర్ ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోషూట్ చేశాడు. 70వ దశకంలో పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్ ఈ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసి అప్పట్లో సంచలనం రేపాడు. బర్ట్ రేనాడ్స్‌కు నివాళిలర్పించేందుకు కోసం రణ్‌వీర్ సింగ్‌ను కాస్మోపాలిటన్ మ్యాగజైన్ ఒప్పించింది.

నేలపై బల్లిలా రణ్‌వీర్ ఫోజు

నేలపై బల్లిలా రణ్‌వీర్ ఫోజు


తాజా ఫోటోషూట్‌లో రణ్‌వీర్ సింగ్ నేలపై ఓ తివాచీ వేసుకొని నగ్నంగా కూర్చొని.. అలాగే గోడకు బల్లిలా అతుకున్నట్టు.. నేలకు రణ్‌వీర్ సింగ్ నేలకు అతుక్కొని ఫోటోలకు ఫోజిచ్చాడు. అంతేకాకుండా సాలెగూడు తాళ్లను పట్టుకొని వేలాడుతున్నట్టు మరో ఫోటోలో రణ్‌వీర్ సింగ్ కనిపించాడు.

న్యూడ్ ఫోటోషూట్ గురించి రణ్‌వీర్

న్యూడ్ ఫోటోషూట్ గురించి రణ్‌వీర్


న్యూడ్ ఫోటోషూట్ గురించి రణ్‌వీర్ మాట్లాడుతూ.. భౌతికంగా నగ్నంగా కనిపించడం అంత సులభం కాదు. నటనపరంగా నేను నగ్నంగా కనిపించి ప్రేక్షకులను దొబ్బిపడేశాను. నగ్నంగా నా ఆత్మ ఎలా ఉంటుందో మీరే చూడండి. నేను నగ్నంగా ఎలా ఉన్నాను. వేలాది ముందు కూడా నేను నగ్నంగా మారడానికి సిద్దంగా ఉంటాను.. కానీ అంటూ రణ్‌వీర్ కొన్ని బూతులు ఉపయోగించాడు.

గోడ మీద బల్లిలా

గోడ మీద బల్లిలా

రణ్‌వీర్ సింగ్ న్యూడ్‌గా ఫోటోషూట్ చేయడంపై నెటిజన్లు రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. బాత్రూం గోడ మీద బల్లిని చూసి.. నేను నా బట్టలు తీసేస్తాను అని కామెంట్ పెట్టాడు. మన జనరేషన్‌ను ఇలాంటి వెధవలను కాపాడాలంటే.. బాలీవుడ్‌ను బాయ్‌కాట్ చేయాల్సిందే.
సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఇలానా?

సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఇలానా?


రణ్‌వీర్ సింగ్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇక తన సినిమాలను విజయం నడిపించలేక ఆయనకు ఇలాంటి పరిస్థితి తప్పలేదు. ఆయన నటించిన 83 చిత్రం దారుణమైన ఫ్లాప్‌ను సొంతం చేసుకొన్నది. అలాగే.. జయేష్‌భాయ్ జోర్దార్ కూడా దారుణంగా ఫ్లాప్ అయింది.

బట్టలిప్పేసినంత మాత్రాన ఫ్యాషనా?


సినీ తారలు ఫ్యాషన్ విషయంలో ఫారిన్ కల్చర్‌ను అనుసరించాల్సిందే. పాశ్చత్య ధోరణులే అధునిక జీవితం అనుకొంటే.. తప్పు.. దక్షిణాదిలో హీరోలు ఎంత పద్దతిగా ఉంటారో చూడండి.. బాలీవుడ్ హీరోలకే ఇలాంటి వైపరీత్యం ఎందుకు అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

దారుణమైన ష్యాషన్ టేస్ట్‌


ఇక మరో నెటిజన్ సెటైరిక్‌గా ట్విట్ చేస్తూ.. రణ్‌వీర్ సింగ్‌ ధరించే దుస్తులు చాలా దారుణంగా ఉంటాయి. అలాంటి దుస్తులు ధరించడం కంటే.. నగ్నంగా ఉండటం మంచిదని కొందరు కామెంట్స్ చేస్తే.. వాటిని ఆయన సీరియస్‌గా తీసుకొని ఇలా కనిపించాడా? అయ్యోపాపం అంటూ ఓ నెటిజన్ మాటలతో మరింతగా గుడ్డలిప్పే ప్రయత్నం చేశాడు.

గతంలో నగ్నంగా కనిపించిన తారలు


గతంలో ఇలా నగ్నంగా కనిపించిన వారిలో ప్రముఖ మోడల్, యాక్టర్ మిలింద్ సోమన్, మధుసాప్రే న్యూడ్ ఫోటోషూట్ వైరల్ అయింది. అలాగే పీకే సినిమా కోసం అమీర్ ఖాన్ కూడా నగ్నంగా తెరపైన కనిపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X