సరికొత్త రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. అలా చేసిన మొదటి ఇండియన్ హీరోగా ఘనత.!

By Manoj

జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడు. నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినప్పటికీ.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ టాలీవుడ్‌లోనే ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను కూడా సంపాదించుకున్నాడు. కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక్.. తాజాగా ఓ అరుదైన రికార్డును సాధించాడు. అంతేకాదు, ఈ ఘనత దక్కించుకున్న మొదటి ఇండియన్ హీరోగా నిలిచాడు. ఆ వివరాలు మీకోసం.!

ఏకంగా ఐదు కొట్టేసిన జూనియర్ ఎన్టీఆర్

ఏకంగా ఐదు కొట్టేసిన జూనియర్ ఎన్టీఆర్


కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్'తో అతడు హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నాడు.

డబుల్ హ్యాట్రిక్ కోసం జక్కన్నతో కలిశాడు

డబుల్ హ్యాట్రిక్ కోసం జక్కన్నతో కలిశాడు


ఫుల్ ఫామ్‌లో ఉన్న తారక్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీలో అతడు కొమరం భీంగా నటిస్తుండగా.. చెర్రీ అల్లూరి పాత్రను పోషిస్తున్నాడు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

రెండేళ్లు ఖాళీ.. ఆ విషయంలో స్పెషల్ కేర్

రెండేళ్లు ఖాళీ.. ఆ విషయంలో స్పెషల్ కేర్


RRR కోసం జూనియర్ ఎన్టీఆర్ దాదాపు రెండేళ్ల పాటు డేట్స్ కేటాయించాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాతే తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు. మరోవైపు, ప్రతిష్టాత్మకమైన ఈ మూవీ కోసం తారక్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే లుక్, ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నాడు.

ఎన్టీఆర్ చేసేది మూడు పాత్రలు.. అవే హైలైట్

ఎన్టీఆర్ చేసేది మూడు పాత్రలు.. అవే హైలైట్


భారీ బడ్జెట్.. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఎన్టీఆర్.. మూడు గెటప్‌లలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగే, అతడి పాత్ర చేసే సాహసాలు సినిమాకు హైలైట్ అవుతాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పులితో ఎన్టీఆర్ చేసే ఫైట్, బ్రిటీష్ వాళ్ల ట్రైన్‌ను అతడు దోచుకునే సీన్ చాలా బాగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

ఆరోజు వచ్చింది... అనుకున్న దాని కంటే ఎక్కువే

ఆరోజు వచ్చింది... అనుకున్న దాని కంటే ఎక్కువే


RRR షూటింగ్ ప్రారంభమై ఏడాదిన్నర పూర్తయిన తర్వాత ఆ మూవీ నుంచి సర్‌ప్రైజ్ వచ్చింది. ఉగాది పండుగ రోజు ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కాగా.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం అతడి పాత్రకు సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఈ రెండింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా రామరాజు వీడియో రికార్డు వ్యూస్ సాధిస్తోంది.

సరికొత్త రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్

సరికొత్త రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్


రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి బృందం ప్రత్యేకమైన వీడియోను తయారు చేసిన విషయం తెలిసిందే. ‘భీమ్ ఫర్ రామరాజు' పేరుతో వచ్చిన ఈ వీడియోలో చరణ్‌ను హైలైట్‌గా చూపించారు. మొత్తం ఐదు భాషల్లో ఇది విడుదల కాగా, మలయాళం మినహా అన్ని భాషల్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పి సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

Recommended Video

RRR Movie Motion Poster Is Copied From Those Movies ?
అలా చేసిన మొదటి ఇండియన్ హీరోగా ఘనత.!

అలా చేసిన మొదటి ఇండియన్ హీరోగా ఘనత.!


ఈ వీడియో విడుదల అయిన తర్వాత చాలా మంది ఎన్టీఆర్ వాయిస్ గురించే మాట్లాడుతున్నారు. అంతలా అతడి స్పష్టమైన డైలాగులు పేలుతున్నాయి. దీంతో సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇలా ఒకేసారి నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పిన ఏకైక ఇండియన్ హీరోగా అతడు రికార్డులకు ఎక్కాడు. దీంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X