సైరా నరసింహారెడ్డి మరోమారు వెనక్కి.. కారణం ఏంటి!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, సురేందర్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో సిద్ధం అవుతోంది. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్స్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. సైరా నరసింహారెడ్డి విడుదల తేదీ విషయంలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ చిత్ర విడుదలకు దసరా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా సైరా చిత్రాన్ని ఈ వేసవికి తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ ఇంకా షూటింగ్ ఉండడంతో ఆగస్టులో విడుదలవుతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ చిత్ర విడుదలని దసరాకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆలోగా అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

తెలుగు స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తొలిసారి ఈ తరహా చిత్రంలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. తమన్నా, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











