'సర్కారు వారి పాట' కోసం పవర్ఫుల్ విలన్.. మరో సీనియర్ హీరోపై ఫోకస్ పెట్టిన దర్శకుడు

ఒకప్పటి సీనియర్ హీరోలు కొంతమంది నెగిటివ్ రోల్స్ తో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్, జగపతిబాబు వంటి ఫ్యామిలీ స్టార్స్ కూడా భయంకరమైన విలన్స్ గా దర్శనమిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో మరికొందరు కూడా న్యూ అవతార్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట కోసం గత కొంతకాలంగా దర్శకుడు విలన్ పై చర్చలు జరుపుతున్నారు. ఇక ఇటీవల ఒక సీనియర్ స్టార్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

మహేష్ సరికొత్త లుక్కుతో..

మహేష్ సరికొత్త లుక్కుతో..

సర్కారు వారి పాట కోసం మహేష్ అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా మహేష్ సరికొత్త లుక్కుతో కనిపిస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ కూడా సాలీడ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న విషయం..

కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న విషయం..

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన ఒక గాసిప్ గత ఏడాది నుంచి అభిమానులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. సినిమాలో విలన్ గా కనిపించబోయేది ఎవరు అనే విషయంలో చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇటీవల ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

సుదీప్ ఫిక్స్ అన్నారు.. కానీ..?

సుదీప్ ఫిక్స్ అన్నారు.. కానీ..?

మొదట్లో ఉపేంద్ర, సుదీప్ వంటి కన్నడ నటులను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక కార్పోరేట్ బిజినెస్ మెన్ గా ఉంటూ.. పవర్ఫుల్ విలన్ లుక్కుతో ఉండాలని దర్శకుడు ఇప్పటికే చాలా మంది నటులను సంప్రదించడట. కానీ ఎవరూ కూడా అనుకున్నట్లు కథకి కనెక్ట్ అవ్వడం లేదట. ఇక సుదీప్ దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ అయితే వచ్చింది గాని ఆ విషయం ఎక్కువ రోజులు వైరల్ అవ్వలేదు.

Recommended Video

Sarkaru Vaari Paata దూకుడు తరహాలో.. Mahesh Babu ట్రెండింగ్ !
మాధవన్ ఫిక్స్ అయినట్లే?

మాధవన్ ఫిక్స్ అయినట్లే?

ఇటీవల దర్శకుడు పరశురామ్ మరో సీనియర్ హీరో మాధవన్ ను కూడా కలిసినట్లు టాక్ అయితే వస్తోంది. మాధవన్ తనకు క్యారెక్టర్ నచ్చకపోతే ఎంత పెద్ద సినిమా అయినా రిజెక్ట్ చేస్తుంటాడు. ఇక సర్కారు వారి పాట కథ ఆయనకు బాగా నచ్చడంతో విలన్ పాత్ర చేయడానికి ఇంట్రెస్ట్ చూపినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X