ప్రభాస్ సినిమా తాత్కాలికంగా ఆగిపోయిందా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2019 లో విడుదల కానుంది. ఈ లోపు మరో చిత్రాన్ని ప్రారంభించాలని ప్రభాస్ ఆ మధ్యన భావించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకతంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం ఉంటుందని వార్తలు వచ్చాయి.

రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగే ఈ చిత్రాన్ని ఆగష్టులో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. తాజగా సమాచారం ప్రకారం ఈ చిత్రం తాత్కాలికంగా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాహో షూటింగ్ బిజీగా సాగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టంట్ లతో ప్రభాస్ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడే మరో చిత్రం వద్దని భావించాడా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

News on Prabhas, Radhakrishna movie

ఈ చిత్రానికి పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్లు కూడా వార్తలు వచ్చిన తెలిసిందే. ఇదిలా ఉండగా సాహో చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్. సుజిత్ ఈ చిత్రానికి దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X