సోషల్ మీడియాలో నిహారిక రీఎంట్రీ.. పాఠాలు నేర్చుకున్నా.. సిద్ధంగా ఉన్నానంటూ పోస్ట్!
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఆ మధ్య బ్ వివాదంలో ఆమె కనిపించడంతో కొన్ని రోజుల పాటు ఆమె మీడియాకు టార్గెట్ అయ్యారు. అయితే తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. కొద్ది రోజుల క్రితం తన సోషల్ మీడియా అకౌంట్ డీ యాక్టివేట్ చేసిన నిహారిక ఇప్పుడు మళ్లీ దాన్ని యాక్టివేట్ చేసింది. ఇక ఈ 8 వారాలు లాంగ్ బ్రేక్ లో ఇదే నేర్చుకున్నాను అంటూ ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

టీవీలో రంగ ప్రవేశం
మెగా వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన నిహారిక హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది కానీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఎక్కువగా డిజిటల్ మీద ఫోకస్ పెట్టింది. నిజానికి అంత కంటే ముందే ఆమె పోస్ట్ గార్డ్ టీవీలో రంగ ప్రవేశం చేసింది. అక్కడ కాస్త గుర్తింపు ఉన్న సమయంలోనే సినిమాల్లో తన లక్కు పరీక్షించుకోవడం కోసం సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది.

డి యాక్టివేట్ చేసి
నిర్మాతగా కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్న ఆమె కొన్నాళ్ల క్రితం చైతన్య జొన్నలగడ్డ అనే యువకుడిని వివాహం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం నిహారిక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. దానికి కారణం నిహారిక జిమ్ వీడియో ఒకటి షేర్ చేయడమే. ఆ వీడియో మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఎందుకు వచ్చిన టెన్షన్ అనుకుందో ఏమో కానీ వెంటనే ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను అప్పట్లో డి యాక్టివేట్ చేసింది.

రీ ఎంట్రీ ఇచ్చి
ఆ తర్వాత ఉగాది సమయంలో ఆమె ఉన్న పబ్ మీద పోలీసులు రైడ్ చేయడం, అందులో కొందరు డ్రగ్స్ వాడుతున్నారు అని తేలడంతో ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దీంతో ఆమె కొన్నాళ్లుగా సైలెంట్ గానే ఉంది కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. తన పాత అకౌంట్ ని యాక్టివేట్ చేసి ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సిద్ధంగా ఉన్నాను అంటూ
ఎనిమిది వారాల పాటు ఇంస్టాగ్రామ్ కి లాంగ్ బ్రేక్ తీసుకున్న తర్వాత తాను మూడు పాఠాలు నేర్చుకున్నాను అంటూ నిహారిక పోస్ట్ పెట్టింది. మూడు పాఠాలలో మొదటిది ఈ ప్రపంచం అంతం కాలేదని, అలాగే రెండవది ఇతరులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని తాను పట్టించుకోనని మూడవది నేను నిజంగానే రిఫ్రెష్ అయ్యాను ఇప్పుడు చాలా ఉత్సాహంగా పోస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమె పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.

పుకార్లకు బ్రేకులు
ఈ పోస్ట్ పెడుతూనే ఆమె తన ముఖాన్ని చూపించకుండా ఒక ఫోటో ని కూడా షేర్ చేసింది.. ఇక నిహారిక భర్తతో కనిపించడం లేదంటూ కూడా కొంత ప్రచారం జరిగితే దానికి కూడా రీసెంట్ గానే కౌంటర్ ఇచ్చినట్లయింది. ఆమె నిర్మాతగా ఒక వెబ్ సిరీస్ లాంచ్ అవుతున్న తరుణంలో భర్త కూడా ఆ ఈవెంట్ లో పాల్గొనడంతో అనేక పుకార్లకు బ్రేకులు వేసినట్టు అయింది.


Click it and Unblock the Notifications











