అర్జున్ సురవరం కొత్త రిలీజ్ డేట్ ఖరారు!

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు టీఎన్ సంతోష్ ఉత్కంఠ భరిత అంశాలతో రూపొందించారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అర్జున్ సురవరం చిత్ర విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అర్జున్ సురవరం చిత్రాన్ని మే 1న విడుదల చేయాల్సి ఉండగా అవెంజర్స్ ప్రభావం ఉంటుందని వాయిదా వేశారు.

ఆ సమయంలో నిఖిల్ భాదపడుతూ అభిమానులకు ఇవరణ ఇచ్చాడు. అర్జున్ సురవరం చిత్రాన్ని వాయిదా వేస్తున్నందుకు నాక్కూడా బాధగా ఉందని కానీ అవెంజర్స్ చిత్ర ప్రభావం వలన తప్పడం లేదని నిఖిల్ తెలిపిన సంగతి తెలిసిందే. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నిఖిల్ ఆ సమయంలో తెలిపాడు. తాజాగా అర్జున్ సురవరం చిత్ర యూనిట్ విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

 Nikhils Arjun Suravaram new release date fixed.

మహర్షి చిత్రం విడుదలైన వారం తర్వాత మే 17న అర్జున్ సురవరం చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఆ సమయానికి మహర్షి ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేం. మే చివరి వారంలో సీత, ఎన్జీకే లాంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. ఎటు చూసుకున్న నిఖిల్ అర్జున్ సురవరం చిత్రానికి పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X