twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేరే రూట్‌లో సేవలు.. నా దారి రహదారి అంటోన్న యంగ్ హీరో

    |

    కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు సెలెబ్రిటీలంతా ముందుకు వస్తున్నారు. ఎవరి స్థాయి, హోదాకు తగ్టట్టు విరాళాలు ప్రకటిస్తున్నారు. మొదటగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం విరాళాలు ప్రకటించిన హీరోలు ప్రస్తుతం రూట్ మార్చారు. సినీ కార్మికుల కోసం చిరంజీవి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ఇవ్వడం ప్రారంభిస్తున్నారు. చిరు పిలుపునివ్వడంతో విరాళాలు భారీ మొత్తంలో సమకూరుతున్నాయి.

    అయితే విరాళాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఇష్టం లేని యంగ్ హీరో నిఖిల్.. వేరే రూట్లో వెళ్తున్నాడు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందుండి పోరాడుతున్న డాక్టర్స్, నర్స్‌లు, వైద్య సిబ్బంది, పోలీసులకు ప్రత్యక్షంగా సేవ చేస్తున్నాడు. వారి రక్షణార్థం అవసరమైన శానిటైజర్స్, వైద్య పరికరాలు వంటివి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

    Nikhil Siddharth Helps Medical Staff In Coronavirus

    2000 రెసిపిరేటర్స్ 2000 రీయూజబుల్ గ్లౌవ్స్ 2000 గ్లాసెస్(ఐ ప్రొటెక్షన్) మరియు 2000 శానిటైజర్స్ 10000 మాస్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్స్ ఐసోలేషన్స్ వార్డ్స్‌లోని డాక్టర్స్ ఇతర సిబ్బందికి అంద చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలిపాడు. ఆరోగ్య అధికారుల పర్యవేక్షణలో గాంధీ ఆసుపత్రికి వెళ్లిన నిఖిల్ స్వయంగా వ్యక్తిగత సంరక్షక పరికరాల్ని వైద్యులకు అందించాడు. నిఖిల్ చేస్తున్న ఈ సేవకు నెటిజన్స్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

    English summary
    Nikhil Siddharth Helps Medical Staff In Coronavirus. Nikhil Sevres Medicla Kits, Sanitizers, Gloves to Doctors Police And MedicalStaff Who Are Working Against Coronavirus
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X