నిఖిల్ కార్తికేయ 2.. ఆ సినిమాకు సీక్వెల్ కాదట!
యువ హీరో నిఖిల్ చాలా కాలం తరువాత ఫామ్ లోకి వచ్చాడు. ఆ మధ్య ఫెయిల్యూర్స్ తో కొంచెం సతమతమైన నిఖిల్ మొత్తానికి అర్జున్ సురవరం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ సక్సెస్ అందుకోవడానికి నిఖిల్ ఎంతగా కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా ఆగిపోయింది, అటకెక్కింది అనుకొని అందరూ మర్చిపోతున్న సమయంలో సినిమాను సడన్ గా రిలీజ్ చేశారు.
ఎదో ఒక విధంగా రిలీజ్ చేసిన నిఖిల్ మంచి సమయంలోనే సక్సెస్ అందుకున్నాడు. ఇకపోతే నెక్స్ట్ బాక్సాఫీస్ వద్ద మరొక బిగ్ హిట్ అందుకోవాలని నిఖిల్ కష్టపడుతున్నాడు. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ ని రూపొందిస్తున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కార్తికేయ కథకు సీక్వెల్ కాదని అసలు ఆ సినిమా కథకు కార్తికేయ2కి ఏ మాంత్రం సంబంధం ఉండదని దర్శకుడు చెబుతున్నాడు.

కానీ ఆ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ కలిగిన ఫీలింగ్ ని రెట్టింపు చేసేలా కార్తికేయ 2 ఉంటుందని తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. భారతదేశంలోని వివిధ దేవాలయాల బ్యాక్ డ్రాప్ లొనే కథ నడుస్తుందట.
ఇకపోతే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్న తరుణంలో లాక్ డౌన్ కారణంగా చిత్ర యూనిట్ చేసుకున్న ప్లాన్ కి బ్రేక్ పడింది. దీంతో సినిమా రిలీజ్ కూడా ఇంకాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇక ఇదే నెలలో పెళ్లి చేసుకోవాలని అనుకున్న నిఖిల్ తన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











