ఆ మూవీ డిజాస్టర్ కావడంతో తల తిరిగిపోయింది.. అదే నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్
స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నివాడా లాంటి సినిమాల్లో నటించి డీసెంట్ హిట్లు కొట్టిన నిఖిల్.. తన కెరీర్‌లో సినిమాల పరంగా పెద్ద తప్పులే చేశాడు. నిఖిల్ చేసిన ఎన్నో సినిమాలు బెడిసికొట్టాయి. అయితే కథలను ఎంచుకోవడంలో కొత్తదనం చూపడంతో మళ్లీ నిలబడగలిగాడు.

షోలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు..
మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తోన్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ షోలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. కెరీర్ స్టార్టింగ్లో పడిన కష్టాలు, హ్యాపీ డేస్ సినిమాలో అవకాశం ఇలా ప్రతీ విషయం గురించి పంచుకున్నాడు. ఈ క్రమంలో మంచు లక్ష్మీ అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.

డిజాస్టర్‌తో తల తిరిగిపోయింది..
కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ ఏంటని అడిగిన దానికి సమాధానం చెబుతూ... తన సినీ కెరీర్లో వచ్చిన అతిపెద్ద డిజాస్టర్ మూవీనే తనకు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో డిస్కో అనే సినిమాను చేశానని, అదే తన కెరీర్‌లో టర్నింగ్ అని పేర్కొన్నాడు. ఆ మూవీతో తననకు తల తిరిగిపోయిందని అన్నాడు.

తనను తాను తిట్టుకున్నాడు..
ఈ సినిమా చూశాక.. తనను తానే తిట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నావ్. .ఎందుకు ఇండస్ట్రీకి వచ్చావ్.. ఏం చేద్దామనుకుంటున్నావ్.. ఏం చేస్తున్నావ్ అని తిట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ తరువాత సినిమా కథలను ఎంచుకోవడంలో జాగ్రత్త వహించానని అందువల్ల అదే తనకు టర్నింగ్ పాయింట్ అని తెలిపాడు.

స్వాతి, మధుశాలిని బెస్ట్ ఫ్రెండ్స్...
కలర్స్ స్వాతి తనకు లక్కీ చార్మ్ అని తనతో రెండు సినిమాలు చేశానని, తను మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. స్వాతి, మధు, తాను వాట్సప్ ఫ్రెండ్స్ అని, పెళ్లాయక స్వాతి భర్త కూడా తమ గ్యాంగ్లో కలిసిపోయాడని చెప్పుకొచ్చాడు. అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని తెలిపాడు.


Click it and Unblock the Notifications











