నిఖిల్ ప్రేమలో ఉన్నాడు.. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు ఇవే
హ్యాపీడేస్ సినిమాతో అందర్నీ మెప్పించిన నిఖిల్.. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నివాడా లాంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో.. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. అయితే రీసెంట్ మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తున్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ షోలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

షారుఖ్ సినిమాలే ప్రేరణ..
చిన్నప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలు చూసినప్పుడల్లా.. నేను కూడా ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అయితే ఇంత వరకు ఆ అవకాశం రాలేదు. కానీ ఓ రెండు మూడు నెలల క్రితమే ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. తనంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు.

వృత్తిరిత్యా డాక్టర్..
ఆమె ఒక డాక్టర్.. తనెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయదు.. షూటింగ్‌లో ఉండే ఫోన్ చేయదు.. నా ఫోన్ కూడా చెక్ చెయ్యదు.. తను చాలా మంచిది. పార్టీలకు వెళ్లినా అడగదు.. ఫ్రెండ్స్‌తో ఉంటే.. ఏమనదు.. సరే లేట్ అయినా పర్లేదు.. అంటుందని తనకు కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు.

పుట్టబోయే పాప పేరు కూడా ఫిక్స్...
తనకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమని, తన చెల్లెలి కూతరు తన దగ్గరే ఎక్కువగా ఉంటుందని, తనంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. నాకు పుట్టబోయే పాప పేరు కూడా ఫిక్స్ చేశా.. మాయా సిద్దార్థ్ అంటే ఎంత బాగుంది కదా అంటూ తన మనసులోని కోరికలను చెప్పుకొచ్చాడు.

బ్రేకప్ నుంచి నేర్చుకున్నది ఇదే..
బ్రేకప్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? అని అడగ్గానే.. బాహ్య సౌందర్యం చూసి ప్రేమించడం కాదు.. మనసు చూసి ప్రేమించాలి అంటూ సలహా ఇచ్చాడు. సినిమా ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకున్నారని అడిగితే.. పెద్ద బ్యానర్ అని, మొహమాటాల కోసం సినిమాలు చేయకూడదని నేర్చుకున్నానని తెలిపాడు.


Click it and Unblock the Notifications











