హీరో అవ్వడానికి డబ్బులిచ్చి మోసపోయాను.. ఆడిషన్స్‌లో ఫోటోను చెత్తబుట్టలో పడేశారన్న నిఖిల్
హ్యాపిడేస్ సినిమాతో ఫుల్ ఫేమస్ అయిన నిఖిల్.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో మంచి కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. తాజాగా మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తున్న షోలో పాల్గొన్న నిఖిల్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా..
హ్యాపిడేస్ నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ.. ఇండస్ట్రీలోకి ఎలా ఎందుకు వచ్చాడన్న విషయాలను వెల్లడించాడు. నేరుగా వచ్చి హీరోలం కాలేం కదా.. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించాను. అందరీతో పరిచయాలు పెంచుకోవచ్చని, నిర్మాతలతో కూడా క్లోజ్‌గా ఉండే చాన్స్ వస్తుందని అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాను.
లక్ష మంది అప్లికేషన్స్..
హ్యాపీడేస్ సినిమాకోసం దాదాపు లక్ష మంది దాకా అప్లై చేశారు.దాంట్లో నేను బాగానే నటించాను సెలెక్ట్ అయ్యాను కానీ అది శేఖర్ కమ్ముల వద్దకు నా ఫోటో చేరలేదు.. డస్ట్ బిన్‌లో పడేశారు. చాలా రోజుల వరకు వెయిట్ చేశాను. అందరికీ కాల్స్ వస్తున్నాయ్ కానీ నాకు మాత్రం రావడం లేదు.

అలా అవకాశం వచ్చింది..
ఒకరోజు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి.. చిన్న క్యారెక్టర్.. ఎక్కడో వెనకాల నిలబడేది చేస్తావా? అని అడిగాడు. ఏదైనా చేస్తానని చెప్పి.. వెళ్లాను..నేను వెళ్లిన సమయానికి కరెక్ట్‌గా శేఖర్ కమ్ముల కూడా వచ్చాడు. నేను ధైర్యంగా వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాను.. నన్ను వెంటనే చూసి.. ఇతడ్ని మనం ఎందుకు తీసుకోలేదంటూ.. వెంటనే నన్ను ఓకే చేశాడు..

డబ్బులిచ్చి మోసపోయాను...
సినిమా ఇండస్ట్రీలో మోసం చేసేవారు కూడా ఉంటారు. ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే.. హీరోని చేస్తామని చెబుతారు.. నేను అలా డబ్బులిచ్చి మోసపోయాను. రెండు రోజులు షూటింగ్ చేస్తారు.. మళ్లీ కనబడరు. అలాంటి వారిని నమ్మొద్దని సలహా ఇచ్చాడు. హ్యాపీ డేస్ కోసం శేఖర్ కమ్ముల అందరి చేతిలో 25వేలు పెట్టారని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











