Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కండలు పెంచుతూ ఫుల్ బిజీ.. లాక్ డౌన్‌ను వాడేసుకుంటోన్న యంగ్ హీరో
లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ తారలు ఈ లాక్ డౌన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రధాని మోడీ విధించిన లాక్ డౌన్ సెలెబ్రిటీలకు ఎంతో హాయినిచ్చినట్టు కనిపిస్తోంది. అయితే కొంతమంది మాత్రం షూటింగ్‌లు లేవని బాధపడుతున్నా.. చాలామంది మాత్రం ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపడం, లోలోపల దాక్కుని ప్రతిభకు మెరుగులు దిద్దడం చేస్తున్నారు.
సెలెబ్రిటీల్లో హీరోయిన్స్ వంటింటి చిట్కాలను నేర్చుకుంటూ బిజీగా ఉన్నారు. హీరోలు మాత్రం వర్కౌట్లు చేస్తూ బిజీగా ఉంటే.. మరికొందరు ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇలా అందరూ ఇంటి పట్టునే ఉంటూ ప్రభుత్వాల ఆదేశాలను పాటిస్తున్నారు.
తాజాగా నిఖిల్ సిద్దార్థ్.. లాక్ డౌన్‌ను ఎలా వాడుకుంటున్నాడో తెలియజెప్పాడు. తన తదుపరి చిత్రం కోసం శరీరాకృతిని మార్చేశాడు. ఇంకాస్త మెరుగుపడాలని, లాక్ డౌన్ పూర్తయ్యేలోపు అది కూడా చేసేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కరోనాను పారద్రోలేందుకు పోరాడుతోన్న వైద్యులకు, పోలీసులకు, వైద్య సిబ్బందికి మాస్కులు, గ్లోవ్స్, వైద్య పరికరాలు అందిస్తూ తనకు చేతనైనా సాయాన్ని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడీ యంగ్ హీరో. నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ2, 18 పేజీస్ అనే రెండు చిత్రాలను ఓకే చేశాడు.