twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిఖిల్ షర్ట్ లెస్ పిక్ వైరల్.. సిక్స్ ప్యాక్‌తో దుమ్ములేపుతున్న యంగ్ హీరో

    |

    టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ లాక్ డౌన్‌లో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎంతో మందికి సాయం చేశాడు. ఇంటిఇంటికి తిరిగా మాస్క్‌లు పంచాడు. అంతే కాకుండా వైద్యులు, పోలీసుల కోసం పీపీఈ కిట్స్, షీల్డ్స్, మాస్కులను ప్రత్యేకంగా పంపించాడు. ఇలా కరోనా సమయంలో తనకు తోచిన సాయాన్ని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. లాక్ డౌన్ సమయంలో నిఖిల్ ఓ ఇంటి వాడవ్వడమే విశేషం.

    లాక్ డౌన్‌కు ముందే ఘనంగా పెళ్లి చేసుకోవాలని అంతా ఫిక్స్ చేసుకున్నా.. కరోనా మొత్తం మార్చేసింది. ప్రేమించిన అమ్మాయి పల్లవిని పెళ్లి చేసుకునేందుకు నిఖిల్ చాలానే కష్టపడ్డాడు. చివరకు లాభం లేదని లాక్ డౌన్ ఉండగానే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకున్నాడు. ఈ లాక్ డౌన్ సమయాన్ని మాత్రం బాగానే వినియోగించుకున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఫుల్ వర్కౌట్లు చేస్తూ బిజీగా గడిపేశాడు.

    Nikhil Siddharth Workouts In Lockdown

    సిక్స్ ప్యాక్‌తో నిఖిల్ ఆ మధ్య షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. తాజాగా నిఖిలో మరో ఫోటోను షేర్ చేశాడు. 'లాక్ డౌన్ మళ్లీ వస్తుందో లేదో తెలీదు కానీ.. నేను మాత్రం వస్తున్నాను.. పని జరుగుతూ ఉంది' అంటూ నిఖిల్ షేర్ చేసిన పిక్ తెగ రచ్చ చేస్తోంది. కార్తికేయ 2 కోసం నిఖిల్ కొత్త లుక్‌లోకి మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. నిఖిల్ చివరగా అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

    English summary
    Nikhil Siddharth Workouts In Lockdown. Lockdown Might have caused SetBacks... But I'm Coming Back... (WORK IN PROGRESS)
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X