ఒకేసారి నలుగురు పిల్లలు.. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం కావడం లేదు: నిఖిల్ సిద్దార్థ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నిఖిల్ సిద్ధార్థ మెల్లగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. కేవలం సినిమాలలోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా అతను ఒక మంచి వ్యక్తిగా కూడా గుర్తింపు అందుకుంటున్నాడు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మందికి అతను సహాయం చేశాడు. మెడికల్ పరంగానే కాకుండా పలువురికి ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. అత్యవసర సమయంలో నిఖీల్ ఆక్సిజన్ సిలిండర్ మెడిసిన్స్ తన కారులోనే వెళ్లి ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు చాలామంది వారు చేసిన మంచి పనుల గురించి బయటి ప్రపంచానికి తెలిసేలా ప్రమోషన్స్ చేసుకున్నప్పటికీ నిఖిల్ సిద్ధార్థ మాత్రం వీలైనంత వరకు సైలెంట్ గానే మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాడు అయితే ఈ హీరో ఇటీవల ఒక విషయం పై క్లారిటీ ఇచ్చాడు.

జీవితంలో మొదటిసారి ఒక సాహసం చేస్తున్నట్లు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా స్పందించడానికి మొదటిసారి నాలుగు సినిమాలను తో బిజీ గా మారినట్లు చెప్పాడు. తన జీవితంలో ఎప్పుడూ కూడా ఒక సినిమా కంటే ఎక్కువ ప్రాజెక్టులను ఒకేసారి సెట్స్ పైకి తీసుకురాలేదు. ఇక ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలను లైవ్ లో పెట్టాడు. ఎప్పుడైనా సరే ఒక సినిమా పూర్తి చేసిన తర్వాతనే మరొక సినిమా చేసుకుంటూ వస్తున్నాడు. తన జీవితంలో ఒకేసారి రెండు సినిమాలను లైన్ లో పెట్టలేదు అంటూ ఇక ఇప్పుడు సెట్స్ పై ఉన్న నాలుగు సినిమాలు కూడా తనకు నలుగురు పిల్లల లాంటి వారు అంటూ చెప్పుకొచ్చారు.

Nikhil Siddhartha about his four upcoming projects

ముందుగా ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వాలో కూడా అర్థం కావడం లేదు అని చెబుతూ.. అయితే అన్నీ కూడా తనకు చాలా ప్రత్యేకమైన సినిమాలు అంటూ అన్నింటికీ సమానంగా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. సినిమాలన్నీ కూడా అందరికీ నచ్చుతాయని కూడా ధీమా వ్యక్తం చేశాడు. నిఖిల్ చివరగా అర్జున్ సురవరం సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా వెండితెరకు నిఖిల్ గ్యాప్ ఇచ్చి చాలా కాలం అవుతోంది. వీలైనంత త్వరగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు.

ఇక ప్రస్తుతం అతని చేతిలో ఉన్న ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే సుకుమార్ రైటింగ్స్ లో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే కార్తికేయ 2 సినిమా షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఎడిటర్ గ్యారీ దర్శకుడుగా మారి తెరకెక్కిస్తున్న ఒక స్పై థ్రిల్లర్ లో కూడా నటిస్తున్నాడు. ఇక సుధీర్వర్మ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇది వరకే సుధీర్వర్మ దర్శకత్వంలో నిఖిల్ స్వామిరారా, కేశవ అనే సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు చేయబోయే 3వ సినిమా వీరి కాంబినేషన్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X