Karthikeya 3 కూడా ఉంటుంది.. ఆ రేంజ్ ప్లాన్ అంటూ నిఖిల్ క్లారిటీ!

నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకు మళ్ళీ చాలాకాలం తర్వాత రూపొందించిన సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. హిందీలో కూడా విడుదల చేయడంతో అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా నిఖిల్ కెరీర్ లో మొదటిసారి 100 కోట్లు క్రాస్ చేసిన సినిమాగా కూడా కార్తికేయ 2 రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

ఇక ఇప్పుడు ఇదే తరహాలో మరొక సినిమా కూడా వస్తే బాగుంటుంది అని ప్రేక్షకుల కోరుకుంటున్నారు. ఇదివరకే చిత్ర యూనిట్ సభ్యులు దర్శకుడు చందు మొండేటి కూడా కార్తికేయ సినిమా ఫ్రాంచైజ్ గా ఇక ముందు కూడా కొనసాగవచ్చు అని చెప్పాడు. అయితే కార్తికేయ 3 విషయంలో కూడా ఇటీవల హీరో నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరణ ప్రకారం అంతకుమించి అనేలా తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Nikhil Siddhartha clarification on Karthikeya 3 project planing

కార్తికేయ మొదటి పార్ట్ తో పాటు సీక్వెల్ కూడా భారీ విజయాన్ని అందుకుంది కాబట్టి మూడవ సారి మళ్ళీ అదే తరహా సబ్జెక్టుతో రావాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అని నిఖిల్ తెలియజేశారు. అయితే ఇప్పటికే కార్తికేయ 3 స్క్రిప్ట్ కోసం ఒక మేయిన్ పాయింట్ కూడా అనుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అసలు కథపై ఇంకా వర్క్ చేయాల్సి ఉంటుంది అని ఎప్పుడు సినిమాను మొదలుపెడతామో అలాగే ఆ సినిమాను ఇప్పుడు పూర్తి చేస్తామా.. అనే ఆలోచనలోతో తాము కూడా ఎంతో ఆత్రుతగా ఉన్నట్లు నిఖిల్ తెలియజేశాడు. అంతేకాకుండా కార్తికేయ 3 ప్రాజెక్టును 3D రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ఆలోచిస్తున్నట్లు కూడా వివరణ ఇచ్చాడు. ఏదేమైనా కూడా కార్తికేయ సినిమాతో నిఖిల్ మరో రేంజ్ కు వెళ్లడమే కాకుండా దాన్ని ఇంకా మరొక లెవెల్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఇదే టైటిల్ పై రాబోయే సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X