twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనానే కాదు, నా పెళ్లిని ఎవరూ ఆపలేరు.. ఆరు నూరైనా ఆ రోజునే మ్యారేజ్.. నిఖిల్

    |

    కరోనా వైరస్ భయాలు వెంటాడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలతో ఇద్దరు టాలీవుడ్ హీరోల వివాహాలు సందిగ్ధంలో పడ్డాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. హీరోలు నిఖిల్ సిద్ధార్థ, నితిన్ పెళ్లిళ్లు ఏప్రిల్ 16వ తేదీన జరుగాల్సి ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లిళ్లపై ఆంక్షలు విధించడంతో ఈ రెండు కుటుంబాలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏది ఏమైనా నిఖిల్ పెళ్లి చేసుకోవడానికే ముందుకెళ్తాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. నిఖిల్ ఏమన్నారంటే..

    ఏదైనా జరిగితే.. అదే చేస్తాం..

    ఏదైనా జరిగితే.. అదే చేస్తాం..

    కరోనావైరస్‌ ముప్పును తీవ్రంగా ప్రకటించిన ప్రభుత్వం.. మార్చి 31వ తేదీ వరకు ఫంక్షన్ హాల్స్ బుకింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నది. అయితే ఈ విషయంపై నిఖిల్ స్పందిస్తూ.. నా పెళ్లిని కరోనా గానీ, మరోటి గానీ ఏది ఆపలేదు. ఏప్రిల్ 16న జరగాల్సిన నా వివాహం జరగకుండా ఎవరూ ఆపలేరు. ఎదైనా జరిగి పెళ్లి ఆగడానికి కారణమైతే.. మేమిద్దరం గుడిలోకి వెళ్లి పెళ్లి చేసుకొంటాం. అంతే మేము చేయాల్సింది మేం చేస్తాం అని నిఖిల్ మీడియాతో అన్నారు.

    వాయిదా వేసే ప్రసక్తి లేదు

    వాయిదా వేసే ప్రసక్తి లేదు

    గత కొద్దికాలం ప్రేమలో ఉన్న డాక్టర్ పల్లవితో సినీ హీరో నిఖిల్ వివాహం గత నెల నిశ్చమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా భయాలు చోటుచేసుకోవడంపై నిఖిల్ స్పందిస్తూ.. ఏప్రిల్‌లో పరిస్థితి ఎలా ఉన్నా.. నా పెళ్లి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్‌‌ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకొన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. వచ్చేవారం పరిస్థితులు మెరుగుపడుతాయనే ఆశాభావంతో ఉన్నాం అని నిఖిల్ అన్నారు.

    వెడ్డింగ్ ఇన్విటేషన్లు పంపుతున్నాం

    వెడ్డింగ్ ఇన్విటేషన్లు పంపుతున్నాం

    కరోనా భయాలపై కొద్దిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మా కుటుంబాలు వేచి చేసే ధోరణితో ఉన్నాయి. సానుకూల దృక్పథంతో వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులకు, సన్నిహితులకు చేరవేస్తున్నాం. ఇంకా నెలరోజులు ఉండటం వల్ల కరోనా అదుపులోకి వస్తుందనే అనుకొంటున్నాం. అందుచేత మా ప్రయత్నాల్లో మేము ఉన్నాం. అంతా మంచే జరుగుతుందనే ఫీలింగ్‌తో ముందుకెళ్తున్నాం అని నిఖిల్ చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Nikhil Siddharth About His Honeymoon
     పార్టీలు, పెళ్లి కార్యక్రమాలు వాయిదా

    పార్టీలు, పెళ్లి కార్యక్రమాలు వాయిదా

    జీవితంలో పెళ్లి అనేది ఎవరికైనా ఓ గొప్ప ఫీలింగ్. కానీ ప్రజల బాగోగులు కూడా చాలా ముఖ్యమనేది మరిచిపోకూడదు. ప్రజలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సన్నిహితుల సెఫ్టీని దృష్టిలోపెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ఇప్పటికే ఈ నెలలో జరుగాల్సిన బ్యాచ్‌లర్ పార్టీ, ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలను వాయిదా వేసుకొన్నాం. అనుకొన్న తేదీకే పెళ్లి జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు అని నిఖిల్ పేర్కొన్నారు.

    English summary
    Actor Nikhil Siddhartha firm on his wedding. He said that Nothing can stop me from getting married on April 16. If something happens, just the two of us getting married in a temple.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X