Spy Movie థియేటర్స్ కౌంట్.. మరోసారి గ్రాండ్ గా నిఖిల్ మూవీ రిలీజ్.. అక్కడే ఎక్కువగా..
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమా ఈవారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకే నిఖిల్ విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా అటు హిందీలో కూడా ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈసారి కూడా అదే తరహాలో ఆకట్టుకోవాలి అని నిఖిల్ సిద్దార్థ్ స్పై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ శుక్రవారం గ్రాండ్ గా విడుదల కాబోతున్న సినిమా డీసెంట్ బిజినెస్ అయితే చేసింది. ఈ సినిమాను రాజశేఖర్ నిర్మించడమే కాకుండా సొంతంగా కథను కూడా అందించారు.

ఇక గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఆయన మరణించారా లేదా అదృష్టమయ్యారా అనే మిస్టరీని ఈ సినిమాలో చాలా లోతుగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
నైజం ఏరియాలో స్పై సినిమాకు 235 థియేటర్లో విడుదల చేస్తుండగా సీడెడ్ లో 120 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఆంధ్ర మొత్తంలో 285 థియేటర్లలో విడుదలవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం చూసుకుంటే స్పై సినిమా 635 ధియేటర్లలో విడుదలవుతోంది.
మిగతా భాషల్లో, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 550 కి పైగా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఓవర్సీస్ లో 425 పైగా థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1600కు పైగా థియేటర్లలో గ్రాండ్ విడుదలవుతోంది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద 18.5 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే ఈ సినిమా సక్సెస్ అయినట్లు లెక్క. మరి ఆ టార్గెట్ ను స్పై సినిమా ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి ఏదేమైనా కూడా ఈ సినిమాకు తప్పనిసరిగా పాజిటివ్ గా వస్తేనే సక్సెస్ అవుతుంది.


Click it and Unblock the Notifications











