Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఈ రోజే నా పెళ్లి కొడుకు ఫంక్షన్.. నితిన్ ఎమోషనల్ కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. సాధారణంగా నితిన్ సినిమాలు తప్పితే మరో విషయాల్ని పెద్దగా పట్టించుకోడు. బాహ్య ప్రపంచానికి ఇతర వ్యక్తులకు చాలా దూరంగా ఉంటాడు. కేవలం ఒక సాధారణ అభిమానిగా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కటౌట్ తో దర్శనమిస్తూ ఉంటాడు. మొత్తానికి ఈ సీనియర్ యంగ్ హీరో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే.
నాలుగు పదుల వయసు దగ్గరపడుతుండడంతో ఇంట్లో వాళ్ళ ఎమోషమాల్ మూమెంట్స్ ని తట్టుకోలేక ఫైనల్ గా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అసలైతే గత ఏడేళ్లుగా నితిన్ ఇంట్లో పెళ్లి మీటింగ్ లు జరిగాయట. ఎదో ఒక విధంగా 40లోకి రాకముందే పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్న సమయంలో కరోనా దెబ్బకు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
అసలైతే కరోనా గోల లేకుంటే నితిన్ పెళ్లి కొడుకుగా దర్శనమిచ్చే వాడు. ఏప్రిల్ 12 ఆదివారం పెళ్లి కొడుకు ఫంక్షన్ జరగాల్సింది. దుబాయ్ లో పెళ్లి చేసుకోవాలని నాలుగు నెలల ముందే ప్లాన్ చేసుకున్న నితిన్ లాక్ డౌన్ నేపథ్యంలో మళ్ళీ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ ఇదే విషయాన్ని చెప్పాడు. ఈ పాటికి సగం పెళ్లి అయ్యుండేదని అయితే కరోనా దాన్ని పూర్తిగా మార్చివేసినట్లు చెప్పడు. అదే విధంగా భీష్మ సినిమా రెండు సార్లు థియేటర్ లో చూశానని చెబుతూ మూడవసారి అభిమానులతో చూడాలని అనుకున్న కోరిక తీరకుండానే పోయినట్లు నితిన్ వివరణ ఇచ్చాడు.