పవర్ స్టార్ డైరెక్టర్ కు నితిన్ గ్రీన్ సిగ్నల్.. వరుస డిజాస్టర్స్ వచ్చినా డిమాండ్ తగ్గట్లేదుగా..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న హీరోలలో నితిన్ కూడా ఉన్నాడు. అతను చివరగా భీష్మ సినిమాతో మాత్రమే బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఎలాంటి సినిమా చేసిన కూడా కమర్షియల్ గా నితిన్ కు ఎలాంటి విజయాన్ని ఇవ్వలేదు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న నితిన్ కు నిరాశే మిగిలింది. ఎంతో భిన్నంగా వచ్చిన చంద్రశేఖర్ ఏలేటి చెక్ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.
ఇక ఆ తర్వాత వచ్చిన రంగ్ దే సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక మాస్ట్రో సినిమా మాత్రం డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైంది. నటుడిగా నితిన్ కు ఒక మంచి గుర్తింపును అయితే తెచ్చిపెట్టింది. ఇక నెక్స్ట్ ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని ఇటీవల నితిన్ నుంచి మాచర్ల నియోజకవర్గం అనే సినిమా విడుదల చేశాడు. ఈ సినిమా నితిన్ హోమ్ బ్యానర్ లోనే నిర్మించారు. అయితే కమర్షియల్ గా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ కూడా పూర్తిస్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రాఫిట్స్ అందించలేకపోయింది.

అయితే బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా మూడు డిజాస్టర్స్ ఎదురైనప్పటికీ కూడా నితిన్ కు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం లైనప్ లో మూడు సినిమాలు ఓకే అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా అయితే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక మరోసారి భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల తోనే కొత్త సినిమా చేయబోతున్న నితిన్ ఇటీవల పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్రకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొన్ని కథలపై ఇటీవల చర్చలు జరుగగా నితిన్ ఒకదాన్ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుగానే నితిన్ సాగర్ తో కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











