ఎందయ్యా ఈ పొలిటికల్ సినిమాలు.. నెటీజన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన నితిన్

భీష్మ సక్సెస్ అనంతరం విభిన్నమైన సినిమాలు చేస్తున్న నితిన్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. వరుసగా చెక్, రంగ్ దే సినిమాలు ఆడియెన్స్ ను నిరాశపరిచాయి. అయితే ఆ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా నితిన్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. అతని తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అనే చెప్పాలి. నితిన్ నెక్స్ట్ సినిమాను వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.

కిక్, రేసుగుర్రం, టెంపర్ సినిమా కథలతో రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వక్కంతం వంశీ మొదట 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయిన తరువాత ఈ రచయితకు దర్శకుడిగా చేసే అవకాశం మళ్ళీ దొరకలేదు.

ఇక నితిన్ అవకాశం ఇవ్వడంతో ఎలాగైనా మళ్ళీ డైరెక్టర్ గా సెట్టవ్వాలని చూస్తున్నాడు. అయితే వీరి కలయికలో వచ్చే సినిమా పొలిటికల్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా జూనియర్ అనే టైటిల్ కూడా అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఎందయ్యా ఈ పొలిటికల్ కామెడీ సినిమాలు అని ఒక నెటీజన్ అసంతృప్తితో ఆడగడంతో వెంటనే నితిన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Nithiin clarification on his upcoming movie title and concept

'ఫేక్ రాజా చిల్ అవ్వు.. గట్టిగా కొడదాం ఈ మూవీ.. ట్వీట్ స్టోర్ చేస్కో..' అని నితిన్ ట్వీట్ చేశాడు. ఇక హీరో ఈ విధంగా క్లారిటీ ఇవ్వడంతో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. వక్కంతం వంశీ కథపై నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటించిన విషయం తెలిసిందే. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించనున్నారు. ఇక నితిన్ నటించిన మరో కొత్త సినిమా మాచర్ల నియోజకవర్గం త్వరలోనే విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X