శివుడి గెటప్‌లో నితిన్.. ఫ్రెండ్స్ అలా అడుగుతున్నారట!
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాదిలో మాత్రం తన చిత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రతిభగల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు నితిన్ ప్రకటించాడు.
ఇదిలా ఉండగా నితిన్ స్నేహితులెవరో ఓ ఫోటో చూసి అతడికి షేర్ చేశారట. నీ నెక్స్ట్ మూవీలో శివుడి గెటప్ లో నటిస్తున్నావా అని అడిగారట. ఆ ఫోటోని నితిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫ్యాన్ మేడ్ పిక్ నితిన్ ని గుర్తు చేసేలా ఉంది. దీనిని ఎవరు తయారు చేశారో తెలియదు. ఈ ఫోటో చేసే సమయంలో వారి మైండ్ లో నేను ఉన్నట్లు ఉన్నాయి. చూడగానే నన్ను గుర్తు చేసేలా లేదు.. కానీ ఎక్కడో ఎదో పోలిక ఉందని నితిన్ తెలిపాడు.

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోని చిత్రం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. కీరవాణి ఈ చిత్రాన్ని సంగీత దర్శకుడు. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కించనున్నారు. భీష్మ చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











