మహానటి కాదు.. మహా నాటు... టార్చర్ పెట్టింది.. కీర్తి సురేష్‌పై హీరో నితిన్ నాటీ కామెంట్స్
సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ సూర్యదేవర నిర్మాతగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం రంగ్ దే. ఈ సినిమా మార్చి 26వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మార్చి 21 తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ...
నితిన్ నా తమ్ముడు లాంటి వాడు.. త్రివిక్రమ్ భావోద్వేగం.. రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

ప్రతీ ఫ్లాప్ తర్వాత హిట్ సినిమా
నా సినిమా కెరీర్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో మంచి అనుబంధం ఉంది. అఆ సినిమాకు ముందు నాకు ఫ్లాప్ ఉండేది. అఆ సినిమాతో నాకు హిట్ ఇచ్చారు. అలాగే భీష్మ సినిమాకు ముందు నాకు ఫ్లాప్ ఉండేది.. భీష్మతో హిట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు రంగ్ దేకు ముందు ఫ్లాప్ వచ్చింది. మళ్లీ నాకు వాళ్లు రంగ్ దేతో హిట్ ఇస్తున్నారు. అందుకు వంశీ, రాధాకృష్ణకు థ్యాంక్స్ అని నితిన్ అన్నారు.

కీర్తి సురేష్ మహానటి కాదు...
కీర్తి సురేష్‌ను చూడగానే మనకు మహానటి గుర్తోస్తారు. కానీ ఈ సినిమాలో మహా నాటీ, మహా నాటుగా కనిపిస్తారు. ఆమె నన్ను చాలా టార్చర్ పెట్టింది. ఈ సినిమాలో తన పాత్ర వరకు చాలా చాలా బాగా చేసింది. ఈ సినిమాకు కీర్తి పెద్ద అసెట్. ఈ సినిమాలో నా పక్కన నటించేందుకు ఒప్పుకొన్నందుకు చాలా థ్యాంక్స్ అని నితిన్ అన్నారు.
రానా అరణ్య కోసం విక్టరీ వెంకటేష్.. అబ్బాయిపై బాబాయి లవ్లీ కామెంట్స్ (ఫొటోలు)

కీర్తి సురేష్ నాకు మంచి ఫ్రెండ్‌గా
రంగ్ దే సినిమా ద్వారా మేమిద్దరం బాగా కనెక్ట్ అయ్యాం. జీవితాంతం స్నేహితులుగా ఉండేంతగా మా మధ్య బంధం ఏర్పడింది. అలాంటి రిలేషన్ ఏర్పడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. స్క్రీన్ మీద మేరే చూస్తారు అని నితిన్ అన్నారు.
ఈవెంట్లో సీఎం సీఎం అంటూ ఫాన్స్ కేకలు: ఎన్టీఆర్ సీరియస్ (ఫొటోలు)

వెంకీ కాలేజ్ లైఫ్‌లో
ఆ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి గురించి మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా నాకు తెలుసు. మేమిద్దరం చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నాం. ఆయన అన్ని లవ్ స్టోరీలనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఆయన కాలేజీ జీవితంలో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయో ఏమో.. కానీ నాకు కొన్ని ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని తెలుసు అని నితిన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











