రెండు సినిమాలపై గురిపెట్టిన నితిన్.. దర్శకులు వీరే!

యంగ్ హీరో నితిన్ కొత్త ఏడాది జోరు పెంచబోతున్నాడు. రెండు చిత్రాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. గత ఏడాది నితిన్ కు అంతగా కలసి రాలేదు. గత ఏడాది విడుదలైన ఛల్ మోహన్ రంగ,, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో రొమాంటిక్ టచ్ ఉండే ఎంటర్ టైనింగ్ చిత్రాలపై నితిన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఛలో చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల త్వరలో నితిన్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అదే సమయంలో సూర్య ప్రతాప్ అనే డెబ్యూ దర్శకుడితో కూడా నితిన్ ఓ రొమాంటిక్ కామెడీ చిత్రానికి కమిట్ అయ్యాడట. ఈ రెండు చిత్రాల షూటింగ్ తో నితిన్ బిజీ కాబోతున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఎక్కుగా ఫన్ ఉండేలా చూడాలని నితిన్ తన దర్శకులకు సూచించినట్లు తెలుస్తోంది.

Nithiin is planning to shoot back to back for films in order to accommodate two releases this year.

వెంకీ దర్శత్వంలో తెరకెక్కబోయే చిత్రం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక సూర్య ప్రతాప్ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ఈ రెండు చిత్రాలకు సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X