Macherla Niyojakavargam: నితిన్ రేంజ్ అస్సలు తగ్గట్లేదుగా.. హిట్ లేకపోయినా అదిరిపోయే డీల్స్!
టాలెంటెడ్ హీరో నితిన్ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఇలాంటి. ఎలాంటి సినిమా చేసినా కూడా గతంలో మాదిరిగా అయితే సక్సెస్ కావడం లేదు. చివరగా నితిన్ నుంచి 2020 లో వచ్చిన భీష్మ సినిమా మాత్రమే పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. గత ఏడాది నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన చెక్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన రంగ్ దే సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. కానీ నటుడిగా నితిన్ మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్తగా డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అడుగులు వేస్తున్నాడు. ఇక బాలీవుడ్ అందధూన్ రీమేక్ మూవీని మొదట థియేటర్ లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా ఓటీటీ లో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆ సినిమాలో నటించిన విధానానికి కూడా నితిన్ కు మంచి గుర్తింపు లభించింది. ఇక ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. ఓ వర్గం ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇంతకుముందు నితిన్ వరుస అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ సినిమా మార్కెట్ పై ఏ మాత్రం పెద్దగా ప్రభావం పడలేదు అని తెలుస్తోంది.
ఈ సినిమా రాయలసీమ హక్కులు ఇటీవల ఏకంగా 4 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. నైజాంలో కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. మొత్తంగా ఈ సినిమాతో నితిన్ 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ కూడా విడుదల కాలేదు. కానీ తప్పకుండా మాచర్ల నియోజకవర్గం సినిమా మాత్రం అతని కెరీర్లో మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్స్ గా నటించారు.


Click it and Unblock the Notifications











