హీరో నితిన్‌కు ఆమె నుంచి విముక్తి: బిగ్ అప్‌డేట్‌తో వస్తున్నామంటూ ‘మాస్ట్రో’ ప్రకటన
గత ఏడాది 'భీష్మ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్. ఈ ఉత్సాహంతోనే ఈ సంవత్సరం అతడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో 'చెక్' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడిపోయింది. దీంతో అతడికి ఆదిలోనే బిగ్ షాక్ తగిలినట్లైంది. ఇక, దీని తర్వాత నితిన్.. వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'రంగ దే' చిత్రం విడుదలైంది. ఇది కూడా భారీ అంచనాల నడుమ విడుదలైంది. టాక్ బాగానే ఉన్నా కలెక్షన్లను రాబట్టలేక పరాజయం పాలైంది.
ఈ సంవత్సరం అప్పుడే హీరో నితిన్‌కు వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అతడు దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' అనే సినిమాలో నటించాడు. బాలీవుడ్ బంపర్ హిట్ అవడంతో పాటు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకున్న 'అంధాధున్'కు ఇది రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అయింది. ఇక, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అనుకున్న టైమ్‌కు సినిమాను విడుదల చేయలేదు.

ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న 'మాస్ట్రో' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్‌తో పాటు పాటలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేసింది. ఇక, ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారని, ఇందుకోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఏకంగా రూ. 32 కోట్లకు దీని హక్కులను కొనుగోలు చేసిందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'మాస్ట్రో' మూవీ నుంచి ఓ అదిరిపోయే పోస్టర్ విడుదలైంది. ఇందులో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని అంధుడి గెటప్‌లో ఉన్న నితిన్ పక్కన.. తుపాకీ పట్టుకుని కనిపించింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఇక, ఈ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. 'మాస్ట్రో బృందం నుంచి అందిరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మా హీరో నితిన్‌కు కూడా తమన్నా నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుందని అనుకుంటున్నాము. తర్వాత భారీ ప్రకటన వెలువడనుంది' అంటూ ట్వీట్ చేసింది. దీంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి.

క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'మాస్ట్రో'లో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. దీన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇది త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











