హాట్ టాపిక్ అవుతున్న నితిన్ లవ్ మ్యాటర్.. పెళ్లి చేసుకోబోయేది ఆమెనేనా.?

By Manoj Kumar P

చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశాడు యంగ్ హీరో నితిన్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలు సాధించాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు జోరు ప్రదర్శించినా ఆ తర్వాత వరుస వైఫల్యాలను చవి చూశాడు. ఇక, ఇష్క్ తర్వాత అతడి కెరీర్‌కు పునర్వైభవం వచ్చింది. కానీ, నితిన్ నటించిన చివరి రెండు మూడు సినిమాలు నిరాశనే మిగిల్చాయి.

ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా నితిన్ వివాహం గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. దీంతో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఆ అమ్మాయి ఎవరని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఓ విషయం బయటకు వచ్చింది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు

వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు నితిన్. విజయం కోసం వైవిధ్యమైన కథలకు ఓకే చెప్పినప్పటికీ అవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. దీంతో సరికొత్త కథలకు ఓకే చెబుతూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ‘భీష్మ', ‘రంగ్ దే', ‘చదరంగం' వంటి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

 మరో యంగ్ హీరోతో కలిసి సినిమా

మరో యంగ్ హీరోతో కలిసి సినిమా

ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మూడు సినిమాలు కాకుండా నితిన్ మరో ప్రాజెక్టును ఓకే చేశాడని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో అతడు హీరోగా చేయడం లేదట. దీనికి అతడు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరోను తీసుకోవాలని అతడు భావిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఆ సినిమా హక్కులు కొన్నాడు

ఆ సినిమా హక్కులు కొన్నాడు

గత ఏడాది బాలీవుడ్‌లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘అంధాధున్'. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నటనకు గానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు నితిన్ కొన్నాడు.

హాట్ టాపిక్ అవుతోన్న నితిన్ లవ్

హాట్ టాపిక్ అవుతోన్న నితిన్ లవ్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. త్వరలోనే ఈ యంగ్ హీరో ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాడనేదే ఆ వార్త సారంశం. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకును వచ్చే ఏప్రిల్‌ను చేయబోతున్నారని కూడా అంటున్నారు. నితిన్ చేసుకోబోయే అమ్మాయి పరిశ్రమకు చెందిన వారు కాదట. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

నితిన్ చేసుకునే అమ్మాయి ఆమేనా?

నితిన్ చేసుకునే అమ్మాయి ఆమేనా?

నితిన్ పెళ్లి వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచే.. అతడు చేసుకోబోయే అమ్మాయి ఎవరని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి గురించి ఓ వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఈమె హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమార్తె అని సమాచారం. వీళ్లిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని కూడా తెలిసింది.

More from Filmibeat

Read more about: nithiin నితిన్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X