ప్రభాస్ గ్యాంగ్ లో నితిన్.. ఏం జరుగుతోంది?
టాలీవుడ్ యువ టాలెంటెడ్ కథానాయకుడు నితిన్ ఈ మధ్య ప్రయోగాలు కాస్త ఎక్కువగనే చేస్తున్నాడు. గతంలో వరుసగా అపజయాలతో సతమతమైన ఈ హీరో భీష్మ అనే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాతో ఒక పవర్ఫుల్ హిట్టు కొట్టడు. అయితే వెంటనే మళ్ళీ రొటీన్ గా ట్రై చేయవద్దని చెక్ సినిమా చేశాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇక చెక్ అనంతరం చేసిన చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ రంగ్ దే సినిమా కూడా దెబ్బేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మొదట్లో ఓపెనింగ్స్ బాగానే రబట్టినప్పటికి ఆ తరువాత కలెక్షన్స్ మెల్లగా తగ్గిపోయాయి. ఇక నెక్స్ట్ ఎలాగైనా అందాదున్ రీమేక్ మాస్ట్రోతో హిట్టు కొట్టాలని నితిన్ చాలా కసిగా రెడీ అవుతున్నాడు. ఇక ఇటీవల మరొక ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.

ప్రభాస్ స్నేహితుల ప్రొడక్షన్ అయినటువంటి యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే నితిన్ ప్రస్తుతం యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. బహుశా అదే సినిమాను యూవీ బ్యానర్ లో నిర్మించవచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలి అంటే నితిన్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











