నితిన్ న్యూ చాలెంజ్ చూసారా.. మూడు నిమిషాల్లోనే ఐదు వందల సార్లు..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇటీవల తన ప్రేయసిని పెళ్లాడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ఇబ్బంది పెడుతున్నా కూడా కొంత హడావుడి గానే వివాహ వేడుకను ముగించాడు. ఒక వైపు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఫీట్నెస్ పై కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వినాయకచవితి సందర్భంగా భార్యతో కలిసి ప్రత్యేకంగా గణపతి పూజను నిర్వహించి అభిమానులను ఆకట్టుకున్నాడు.
ఇక ఇప్పుడు పూర్తిగా వర్కౌట్స్ తోనే నితిన్ ఆడియెన్స్ ని సరికొత్తగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. కోచ్ ఇచ్చిన చాలెంజ్ ని తక్కువ నిమిషాల్లోనే పూర్తి చేసి షాక్ ఇచ్చాడు. మొత్తంగా 3 నిమిషాల 25సెకన్లలో 500 జంప్ రోప్స్ ని పూర్తి చేశాడు ఈ యువ హీరో. ఇక వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది కూడా నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. ఇక నితిన్ నెక్స్ట్ రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కీర్తి
సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఆ సినిమా తరువాత నితిన్ మరికొన్ని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే అందాదున్ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిసినట్లు తెలుస్తోంది. దర్శకుడు మెర్లపాక గాంధీ సరికొత్తగా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు టాక్. ఇక అందులో టబు చేసిన పాత్ర కోసం గత కొంతకాలంగా చిత్ర యూనిట్ చాలా మంది సీనియర్ నటీమణులను సంప్రదించినట్లు టాక్. అయితే ఆ పాత్ర ఎవరు చేస్తున్నారు అనే విషయంలో మాత్రం చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











