హీరో నితిన్‌కు అలాంటి శిక్షనా? అందుకే పావులు కదుపుతున్నాడా?

By Manoj Kumar P

చిన్న వయసులోనే భారీ విజయాలు సాధించాడు యంగ్ హీరో నితిన్. టాలీవుడ్‌లోకి ఎంటరైన సమయంలో కొన్నేళ్ల పాటు విజయాలను అందుకున్న నితిన్.. ఆ తర్వాత వరుస వైఫల్యాలను చవి చూశాడు. ఇక, 'ఇష్క్' తర్వాత అతడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయింది. ఈ చిత్రం తర్వాత అతడు కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, నితిన్ నటించిన చివరి రెండు మూడు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా నితిన్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

ఒకేసారి మూడింటితో బిజీ

ఒకేసారి మూడింటితో బిజీ

వరుస పరాజయాలతో కష్టాలను ఎదుర్కొంటున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో పని చేస్తున్నాడు. ముఖ్యంగా తన తదుపరి చిత్రం విషయంలో అతడు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఇందులో భాగంగానే ఒకేసారి మూడు సినిమాలను పట్టాలెక్కించేశాడు. ప్రస్తుతం ఈ మూడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

వాటిలో అదే కొంచెం స్పెషల్

వాటిలో అదే కొంచెం స్పెషల్

నితిన్ చేస్తున్న మూడు సినిమాల్లో వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కొంచెం స్పెషల్ అని అంటున్నారు. విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే డైరెక్టర్ కావడమే దీనికి కారణం అని తెలుస్తోంది. ఇది నితిన్‌కు 28వ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ముగ్గురు హీరోలు కాదన్నారు

ముగ్గురు హీరోలు కాదన్నారు

ఈ సినిమా కథను చంద్రశేఖర్ పలువురు హీరోలకు చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. వారిలో గోపీచంద్, సాయి ధ‌ర‌మ్ తేజ్, నాగ‌ చైత‌న్య వంటి యంగ్ హీరోలు ఉన్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు హీరోలతో ప్లాన్ చేసినప్పటికీ ఇది వర్కౌట్ కాలేదనే టాక్ వినిపించింది. ఇక, చివరి ప్రయత్నంగా నితిన్‌ను సంప్రదిస్తే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి.

చదరంగం ఆడిస్తాడట

చదరంగం ఆడిస్తాడట

ఈ సినిమాను స్క్రీన్ ప్లే ఆధారంగా నడిపిస్తాడట దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. ఇందులో నితిన్ చెస్ ప్లేయర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు ‘చదరంగం' అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ కూడా ఇదే కావడంతో, దీన్నే ఫైనల్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఉరిశిక్ష నుంచి అలా తప్పించుకుంటాడట

ఉరిశిక్ష నుంచి అలా తప్పించుకుంటాడట

ఈ సినిమాలో నితిన్ చెస్ ప్లేయర్ అని ముందే చెప్పుకున్నాం. కథలో భాగంగా హీరో ఓ కేసులో ఇరుక్కుంటాడట. దీంతో న్యాయస్థానం అతడికి ఉరిశిక్షను విధిస్తుందని తెలుస్తోంది. ఉరిశిక్ష పడిన ఖైదీ అయిన నితిన్ దేశం కోసం చెస్ ఆడేందుకు అనుమతి తీసుకుంటాడట. ఆ టోర్నీలో దేశానికి పతకం తీసుకు రావడంతో ఉరిశిక్షను రద్దు చేస్తారట. ఇదే ఈ సినిమా కథ అని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X