హీరో నితిన్‌కు కోలుకోలేని షాక్: రిలీజ్ రోజే లీకైన ‘రంగ్‌ దే’.. ఆ సైట్లలో ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్!

కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకుని.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యూత్ హీరో నితిన్. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ.. 'ఇష్క్' తర్వాత నుంచి అతడి కెరీర్‌కు బూస్ట్ వచ్చింది. అప్పటి నుంచి జయాపజయాలతో సాగిపోతోన్న అతడు.. ఇటీవలి కాలంలో బడా హిట్లనే అందుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా 'రంగ్ దే' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇలాంటి సమయంలో నితిన్‌కు షాక్ ఇస్తూ ఈ మూవీని లీక్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

ఆరంభంలోనే నితిన్‌కు ఘోర పరాజయం

ఆరంభంలోనే నితిన్‌కు ఘోర పరాజయం

విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి - నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'చెక్'. చదరంగం ఆట నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఇది భారీ పరాభవాన్ని చవి చూసింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు.

‘రంగ్ దే' అంటూ ఆమెతో కలిసి వచ్చేశాడు

‘రంగ్ దే' అంటూ ఆమెతో కలిసి వచ్చేశాడు

2021 ప్రారంభంలోనే భారీ ఫ్లాప్‌తో ఇబ్బంది పడ్డాడు యూత్ స్టార్ నితిన్. ఇలాంటి పరిస్థితుల్లో తన తదుపరి చిత్రాన్ని విడుదల చేసేందుకు అతడు రెడీ అవుతున్నాడు. ఆ సినిమానే 'రంగ్ దే'. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

భారీ అంచనాలు.. అనుగుణంగానే బిజినెస్

భారీ అంచనాలు.. అనుగుణంగానే బిజినెస్

పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'రంగ్ దే'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.6 కోట్లు, ఆంధ్రాలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 21.20 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

గ్రాండ్‌గా విడుదల.. అన్ని చోట్లా పాజిటివ్‌గా

గ్రాండ్‌గా విడుదల.. అన్ని చోట్లా పాజిటివ్‌గా

'రంగ్ దే' మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 800 థియేటర్లలో విడుదల అయింది. ఇది ప్రదర్శితమైన అన్ని ప్రాంతాల్లోనూ మంచి స్పందననే అందుకుంది. అందుకు అనుగుణంగానే టాక్ కూడా మంచిగానే వినిపిస్తోంది. దీనికి తోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. తద్వారా నితిన్ ఖాతాలో మరో హిట్ వచ్చిందని అంటున్నారు. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటోంది.

 నితిన్‌కు కోలుకోలేని షాక్.. రిలీజ్ రోజే లీక్

నితిన్‌కు కోలుకోలేని షాక్.. రిలీజ్ రోజే లీక్

మొదటి రోజే మంచి స్పందనను అందుకోవడంతో 'రంగ్ దే'కు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. ఇక, లాంగ్ వీకెండ్ కావడంతో సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నితిన్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. 'రంగ్ దే' మూవీ విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయిపోయింది.

ఆ సైట్లలో ఫుల్ ‘రంగ్ దే' డౌన్‌లోడ్ లింక్

ఆ సైట్లలో ఫుల్ ‘రంగ్ దే' డౌన్‌లోడ్ లింక్

పైరసీని ప్రోత్సహించే కొన్ని వెబ్‌సైట్లు 'రంగ్ దే' ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్‌ను శుక్రవారమే ఆన్‌లైన్‌లో పెట్టేశాయి. ఇది పైరసీ మాఫియాకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న తమిళ్ రాకర్స్ చేసిన పనే అని తెలుస్తోంది. అందుకే ఆ సైట్‌తో పాటు మరికొన్నింటిలో ఈ మూవీ థియేటర్ ప్రింట్ దర్శనమిచ్చింది. దీంతో థియేటర్లకు వెళ్లి చూడలేని చాలా మంది ఈ సైట్లను ఆశ్రయించే ప్రమాదం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X