నితిన్ కొత్త చిత్రం.. నాగ చైతన్య దర్శకుడిపై ఆసక్తి!
శ్రీనివాస కళ్యాణం చిత్రం తరువాత నితిన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. శ్రీనివాస కళ్యాణం చిత్రాన్ని నిరాశపరిచింది. దీనితో నితిన్ కథల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. త్వరలో ఆ చిత్రం ప్రారంభం కానుంది. నితిన్ తదుపరి చిత్రాలకు సంబంధించి కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
స్వామిరారా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సుధీర్ వర్మ తో సినిమా చేసేందుకు నితిన్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల సుధీర్ వర్మ కూడా ప్లాపుల్లో ఉన్నాడు. నాగ చైతన్యతో తెరకెక్కించిన దోచేయ్, నిఖిల్ తో తెరకేకించిన కేశవ చిత్రాలు నిరాశ పరిచాయి. కానీ సుధీర్ వర్మ దర్శకత్వ శైలి నితిన్ ని ఆకర్షించినట్లు తెలుస్తోంది.

వీరిద్దరి మధ్య సినిమా కోసం ప్రాధమిక చర్చలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. సుధీర్ వర్మ మంచి స్క్రిప్ట్ సిద్ధం చేస్తే నటించాలని నితిన్ భావిస్తున్నాడట. సుధీర్ వర్మ త్వరగా కథ ఫినిష్ చేస్తే వచ్చే ఏడాదే ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం నితిన్, సుధీర్ వర్మ మధ్య జరిగిన ప్రాధమిక ఒప్పందం మాత్రమే. ప్రస్తుతం నితిన్ దృష్టి మొత్తం వెంకీ కుడుముల చిత్రంపైనే ఉంది.


Click it and Unblock the Notifications











