నితిన్ స్పీడ్ మాములుగా లేదు.. లైన్ లోకి మరో టాలెంటెడ్ దర్శకుడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత స్పీడ్ పెంచుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నితిన్ ఏ మాత్రం స్లో అవ్వడం లేదు. ఈ ఏడాది పెద్దగా గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ రెండు విభిన్నమైన సినిమాలతో వచ్చాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేసిన చెక్ సినిమా ఫిబ్రవరిలో విడుదలవ్వగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
అనంతరం వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన రంగ్ దే సినిమా మొదట్లో మంచి ఓపెనింగ్స్ ను అందుకొని చివరికి నష్టాలతోనే బాక్సాఫీస్ ను క్లోజ్ చేసింది. నితిన్ భీష్మ తరువాత మళ్ళీ అదే తరహాలో హిట్ కొట్టాలని ప్రస్తుతం మాస్ట్తో సినిమాతో సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఆ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మెర్లపాకగాంధీ ఆ సినిమాకు దర్శకుడు.

ఇక ఇదే ఏడాది మరొక విభిన్నమైన సినిమాను సెట్స్ పైకి తేవాలని ఈ యువ హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు. యాత్ర సినిమాతో మంచి దర్శకుడిగా క్రేజ్ అందుకున్న మహి వి రాఘవ.. నితిన్ తో ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం. కథ విన్న నితిన్ పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న అందాదున్ అయిపోగానే ఆ సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. మరి వరుసగా సినిమాలు చేసుకుంటూ వేలుతున్న నితిన్ తన బాక్సాఫీస్ రేంజ్ ను ఏ మేరకు పెంచుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











