డైలామాలో నితిన్ డిస్టినేషన్ వెడ్డింగ్.. పెళ్లికి సరికొత్త వేదిక.. ఎక్కడంటే!
కరోనవైరస్ ప్రభావం సినిమా పరిశ్రమపై అన్ని రకాలుగా ప్రభావితం చూపుతున్నది. హీరోల ప్రొఫెషనల్ లైఫ్స్‌పైనే కాకుండా వ్యక్తిగత జీవితాల మీద కూడా చూపిస్తున్నది. గత కొద్ది నెలల క్రితం పెళ్లి ఏర్పాట్లు చేసుకొన్న టాలీవుడ్ హీరోల ఆశలపై కోవిడ్ 19 నీళ్లు జల్లింది. వాయిదాల మీద వాయిదాలు వేసి పెళ్లి కార్యక్రమాలను నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా హీరో నితిన్ పెళ్లి డైలామాలో పడింది. ఇక ఈ హీరో పెళ్లి వివరాల్లోకి వెళితే..

కరోనా దెబ్బతో పెళ్లి వాయిదా
హీరో నితిన్, షాలిని వివాహానికి దుబాయ్‌లో ఏర్పాట్లు చేశారు. డిస్టెనేషన్ వెడ్డింగ్‌గా నిర్వహించాలని ముందస్తుగా ప్లాన్ చేశారు. అయితే అంతా సవ్యంగా సాగుతుందనుకొంటున్న సమయంలో ప్రపంచాన్ని కరోనా గడగడలాడించింది. దాంతో నితిన్ వివాహాన్ని కుటుంబ సభ్యులు వాయిదా వేశారు. ఇదే విషయాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి ధృవీకరించిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి దుబాయ్‌లో
వాస్తవానికి నితిన్ పెళ్లి ఏప్రిల్ 15వ తేదీన , అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకొన్నారు. అందుకు దాదాపు 100 మంది వరకు గెస్టులను ఆహ్వానించారు. కానీ కరోనా వైరస్ దెబ్బకు ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. అయితే దుబాయ్‌లో ఈ పెళ్లి జరిగేది లేదనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడం గమనార్హం.

డిస్టినేషన్ వెడ్డింగ్ క్యాన్సిల్
ఇక లాక్‌డౌన్ కొనసాగుతుండటం, కరోనా భయాందోళనలు వెంటాడుతుండటంతో డిస్టినేషన్ వెడ్డింగ్‌ను వాయిదా వేయాలని ఫ్యామిలీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అలాగే నితిన్ పెళ్లిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే తమ ఫామ్‌హౌస్‌లో చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే పెళ్లి తేదీలను అధికారికంగా ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లోనే ఫామ్‌హౌస్‌లో
తాజా సమాచారం ప్రకారం.. నితిన్, షాలిని పెళ్లిని డిసెంబర్‌లో చేయాలని ఇరు కుటుంబాలు ఫిక్స్ అయినట్టు తెలిసింది. లేదా పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబర్ లేదా ఏదైనా మంచి రోజును చూసి నిరాడంబరంగా చేయాలనే నిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే అభిమానులు, తన సన్నిహితులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనే నితిన్ కోరికపై కరోనా ఇలా ఊహించని దెబ్బ కొట్టడంతో నిరుత్సాహానికి గురైనట్టు సమాచారం.
Recommended Video

మూడు క్రేజీ ప్రాజెక్టులతో
ఇక నితిన్ కెరీర్ విషయానికి వస్తే.. వేణు కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు. నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నమోదు కావడం విశేషం. ప్రస్తుతం రంగ్ దే అనే చిత్రంలోను, అలాగే చంద్రశేఖర్ ఏలేటి సిిమాలోను, అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదూన్ రీమేక్‌లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











