Nithiin30 అప్డేట్.. హైప్ పెంచేస్తోన్న నితిన్

ప్రస్తుతం నితిన్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఓ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. నితిన్ చంద్ర శేఖర్ యేలేటి కాంబోలో వస్తోన్న చెక్ సినిమా వచ్చే వారం విడుదల కానుంది. ఆ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో తలమునకలై నితిన్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా మరో మూవీ అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సిద్దమయ్యాడు.

నితిన్ రంగ్ దే సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కాబోతోంది. అలా చెక్, రంగ్ దే సినిమా అప్డేట్లు వచ్చేశాయి. ఇక నితిన్ సెట్స్ మీదున్న సినిమాల్లో అంధాదున్ ఒకటి. ఆ సినిమా షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైందని అప్పట్లో ఓ అప్డేట్ ఇచ్చారు. మళ్లీ ఇంత వరకు దాని ఊసే లేకుండా పోయింది. మళ్లీ ఇన్ని రోజులకు అంధాదున్ రీమేక్ అప్డేట్ రాబోతోందని ప్రకటించారు.

Nithin Andhadhun Remake update on 19th feb

నితిన్ 30వ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతోందని ప్రకటించారు. రేపు ఉదయం 8 గంటల 46 నిమిషాలకు అప్డేట్ రాబోతోందని చెప్పేశారు. అయితే సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతోన్నారని కొందరు.. విడుదల తేదిని ప్రకటిస్తారని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో నభా నటేష్,తమన్నాలు నటిస్తున్నారు. శ్రేష్ట మూవీస్ బ్యానర్‌లో నిఖితా రెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X