అల్లు అర్జున్ దర్శకుడితో మరో సినిమాను స్టార్ట్ చేసిన నితిన్.. పవర్ఫుల్ కథతో డిఫరెంట్ ప్రాజెక్ట్!

యువ హీరో నితిన్ మొత్తానికి మరో సినిమాను మొదలు పెట్టాడు. రచయిత నుంచి దర్శకుడిగా మారింత వక్కంతం వంశీ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ కు నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాడు. ఇక గత ఏడాది వరుసగా కొన్ని అపజయాలను ఎదుర్కొన్న మళ్లీ ఈసారి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలి అని చూస్తున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా కూడా రిజల్ట్ తో సంబంధం లేకుండా నితిన్ డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక అతనికి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇక చివరగా భీష్మ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ అనే ఒక సినిమా చేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత రొమాంటిక్ లవ్ స్టోరీ రంగ్ దే తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా నితిన్ కు ఆశించినంత స్థాయిలో విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఇక బాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచినటువంటి అందాధూన్ సినిమాను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమాను కరోనా కష్ట కాలంలో థియేటర్స్ లో విడుదల చేయలేక ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఆ సినిమాతో నటుడిగా నితిన్ మంచి గుర్తింపు అందుకున్నాడు.

 Nithiin new project launch with senior writer vakkantham vamsi

ఇక ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో పాటు మరో సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా ఒక న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ఆ ప్రాజెక్టును నితిన్ నేడు పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టాడు. ఈ సినిమాను నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పైన నిర్మిస్తున్నారు. కథ బాగా నచ్చడంతో నితిన్ తండ్రి ఈ సినిమాను భారీ బడ్జెట్ లో నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

ఇక ఈ సినిమా లో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీలా మెయిన్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాను దర్శకుడు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. వంశీ నుంచి మంచి రచయితగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఇక అతను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా నాపేరు సూర్య బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

ఆ తర్వాత మళ్లీ రచయితగానే కొనసాగిన వంశీ మళ్లీ ఎలాగైనా ఒక సినిమాను వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో అతనికి అవకాశాలు దొరకలేదు. ఇక చాలా రోజులుగా గీతా ఆర్ట్స్ లో నే స్క్రిప్టు సలహాదారుడిగా కొనసాగుతూ వచ్చాడు. ఇక అనంతరం నితిన్ తో ట్రావెల్ అయిన వంశీ కథను చెప్పి ఒప్పించాడు. చాలా రోజులు ఆ కథపై కూర్చొని నితిన్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మార్చాడు. నితిన్ కూడా ఈ సినిమా కథ పై కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. హరీస్ జై రాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X